E-Paper
Advertisement

Veenavanka Tahsildar Office: అవినీతి అడ్డాగా మారిన వీణవంక తహసిల్దార్ కార్యాలయం.. చేయి తడిపితే గాని పని జరగదా?

Veenavanka Tahsildar Office: అవినీతి అడ్డాగా మారిన వీణవంక తహసిల్దార్ కార్యాలయం.. చేయి తడిపితే గాని పని జరగదా?
Advertisement

Veenavanka Tahsildar Office: వీణవంక స్వేచ్ఛ: కరీంనగర్ జిల్లా వీణవంక మండల తహసిల్దార్ కార్యాలయం (Veenavanka Tahsildar Office) అవినీతి కూపంగా మారిందని మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ రికార్డుల సవరణ, పాస్‌బుక్ మార్పులు, ఫీల్డ్ సర్టిఫికెట్లు, ఆదాయ రేషన్ ధృవపత్రాల కోసం కార్యాలయానికి వచ్చే సాధారణ ప్రజలు లంచాల డిమాండ్లతో నానా అవస్థలు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా కలెక్టర్ ఆదేశాలకే లెక్కలేదా?

ఒక రైతు తన భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను కూడా పక్కనపెట్టి, వీణవంక తహసిల్దార్ కావాలనే ఫైల్‌ను ఆపేశారని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేకుండా మౌనం పాటించడమే అనుమానాలకు దారి తీస్తోంది. ఖర్చు పెట్టాలి. అన్న మాట నినాదంలా? ప్రతి చిన్నపాటి పనికీ ఖర్చు పెట్టాలి. ముందు మాట్లాడాలి. అదీ చూడాలి. అనే మాటలు కార్యాలయంలో నినాదాల్లా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ అనుచరులు, మధ్యవర్తులు ఫైళ్లను పట్టివేసి… పేదలు, రైతులను రోజుల తరబడి కార్యాలయ చుట్టూ తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also ReadLPL Financial Hyderabad: హైదరాబాద్‌లో బిలియన్ డాలర్ల వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం.. 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు!

గతంలోనూ అదే పరిస్థితి

గతంలో వీణవంక తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మొత్తం సిబ్బందిని బదిలీ చేసి, కొత్త సిబ్బందిని నియమించినా అవినీతి విధానం మాత్రం మారలేదన్న విమర్శలు మళ్లీ వినిపిస్తున్నాయి. డిప్యూటీ తహసిల్దార్‌గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి తన చేతివాటం ప్రదర్శించిన సమయంలో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించగా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. అదే క్రమంలో తహసిల్దార్ తిర్మల్ రావు కూడా సస్పెండ్ కావడం ఈ కార్యాలయంలో సమస్య ఎంత లోతుగా ఉందో చెప్పకనే చెబుతోంది.

Advertisement

Also Read: Allagadda Politics: భూమా బ్రాండ్ ఇమేజ్‌కు సొంత మనుషులే డ్యామేజ్ చేస్తున్నారా? ఆళ్లగడ్డలో అసలేం జరుగుతోంది?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×