Motorola motobook 60: స్మార్ట్ ఫోన్లతో.. మార్కెట్లో సంచలనం సృష్టించిన మోటరోలా ఇప్పుడు ల్యాప్‌టాప్ రంగంలోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన “మోటోరోలా మోటోబుక్ 60” టెలికాం, టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. ఫుల్ మెటల్ బాడీ, అద్భుతమైన డిస్‌ప్లే , పవర్ ఫుల్ ఇంటెల్ కోర్ i5 14వ జనరేషన్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ ట్రెండ్‌కు తగినట్లుగా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ల్యాప్‌టాప్ హైలైట్ దీని డిస్‌ప్లే, బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇందులో అద్భుతమైన డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల కలర్స్ చాలా సహజంగా, కాంతివంతంగా కనిపిస్తాయి. దీనిలో వీడియోలు చూసేటప్పుడు లేదా సినిమాలు చూసేటప్పుడు థియేటర్ ఫీల్ కలుగుతుంది. ఇక బాడీ విషయానికి వస్తే.. ఫుల్ మెటల్ ఫినిషింగ్ ఉండటం వల్ల ఇది చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీని క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.
స్పీడ్ విషయంలో ఈ ల్యాప్‌టాప్ చాలా మోడల్స్ కంటే అన్నింటికంటే ముందుంటుంది. దీనిలోని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. లేటెస్ట్ ఇంటెల్ కోర్ i5 14వ జనరేషన్ ప్రాసెసర్‌తో ఇది పని చేస్తుంది. దీని వల్ల ఓకే సారి పలు హెవీ యాప్స్ రన్ చేసినప్పటికీ లాగ్ అయ్యే సమస్యే ఉండదు. కోడింగ్ చేసేవారు, వీడియో ఎడిటింగ్ చేసేవారు, ఆఫీస్ వర్క్ చేసుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్, స్టోరేజ్ కోసం ఇందులో లేటెస్ట్ హార్డ్‌వేర్‌ను వాడారు. మల్టీటాస్కింగ్ సులువుగా జరగడానికి తగినంత హై-స్పీడ్ ర్యామ్, పెద్ద ఎస్ఎసడీ స్టోరేజ్ లభిస్తుంది. దీని వల్ల ల్యాప్‌టాప్ ఆన్ అవ్వడానికి, ఫైల్స్ ఓపెన్ అవ్వడానికి కేవలం క్షణాలు మాత్రమే పడుతుంది.
ప్రయాణాలు చేసే వారికి బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. మోటోరోలా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే.. రోజంతా సరిపోయే పవర్ ఫుల్ బ్యాటరీ ఇందులో ఉంది. అలాగే.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే.. బ్యాటరీ ఫుల్ అవుతుంది. వై-ఫై, బ్లూటూత్, వివిధ రకాల పోర్ట్స్ అందుబాటులో ఉండటం వల్ల ఇతర డివైజ్‌లను కనెక్ట్ చేయడం చాలా ఈజీ.
Also Read: ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు బిల్లు టెన్షన్ లేదా?జొమాటో సరికొత్త ట్రిక్!
ఈ ప్రీమియం ఫీచర్లు కలిగిన మోటోరోలా మోటోబుక్ 60 ల్యాప్‌టాప్ ధర ఇండియన్ మార్కెట్లో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని మార్కెట్ ధర రూ.66,990 గా ఉంది. ఈ బడ్జెట్‌లో ఓఎల్ఈడీ డిస్‌ప్లే, i5 14th Gen ప్రాసెసర్ లభించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
మొత్తానికి.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి మోటోరోలా మోటోబుక్ 60 ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు గనక కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఈ ట్రెండీ మోడల్‌ను మీ షాపింగ్ లిస్ట్‌లో చేర్చుకోవడం మంచిది!