Rangareddy: అతివేగం ప్రమాదకరం అని పదేపదే పోలీసులు చెబుతున్నా, వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టుకుని వార్నింగ్ ఇచ్చినా, మళ్లీ మరుసటి రోజు మామూలే. తాజాగా వేగంగా వచ్చిన టయోటా ఇన్నోవా స్టీరింగ్ కంట్రోల్ ఏకంగా ఓ గోడని ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోని నర్కుడ గ్రామం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న టయోటా ఇన్నోవా కారు అదుపు తప్పింది. స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కనున్న గోడను బలంగా ఢీ కొట్టింది. అంతేకాదు ప్రమాదంలో కారు పలు మార్లు పల్టీ కొట్టింది. ప్రమాదం ధాటికి కారు మధ్య భాగం డ్యామేజ్ అయ్యింది.
డోర్లకు ఉండే బీడింగ్ సైతం ఊడిపోయింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కారులో నుంచి బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే కారు ముందు భాగం డ్యామేజ్ అవుతుంది. కానీ ఈ ప్రమాదంలో అంతా రివర్స్ అయ్యింది.
కారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో టర్నింగ్ మరీ దారుణంగా ఉందని, ఎగువ నుంచి వాహనాలు అతివేగంగా రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్న మాట. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని అంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగిన చోట చిన్నారులు తిరుగుతుంటారని, వారికి ఏమైనా జరిగితే అధికారులదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే?
CCTV: Toyota Innova crashes near Narkuda village in Shamshabad
A speeding Toyota Innova lost control and rammed into a roadside wall near Narkuda village in Shamshabad limits of Ranga Reddy district, reportedly overturning several times.
The impact left the vehicle badly… pic.twitter.com/1Q7es0UZVh
— Sudhakar Udumula (@sudhakarudumula) October 30, 2026