E-Paper
Advertisement

TVK Vijay: ఆఫ్టర్ లాంగ్ టైం జనాల్లోకి టీవీకే విజయ్.. స్టాలిన్ నన్నేం చేయలేడంటూ.. సంచలన వ్యాఖ్యలు

TVK Vijay: ఆఫ్టర్ లాంగ్ టైం జనాల్లోకి టీవీకే విజయ్.. స్టాలిన్ నన్నేం చేయలేడంటూ.. సంచలన వ్యాఖ్యలు
Advertisement

TVK Vijay:  కరూర్‌ తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకే అధినేత విజయ్‌ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు. పుదుచ్చేరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఎం. రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తీవ్రంగా విమర్శించారు.

సభలో విజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరని.. కానీ తామంతా కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన బాధ్యత అని పేర్కొంటూ, రంగసామి ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం వంటిది కాదని, ప్రతిపక్ష పార్టీలతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని కితాబునిచ్చారు. తమ పార్టీ ర్యాలీకి అడగగానే భద్రత కల్పించినందుకు పుదుచ్చేరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర పాలనకు సంబంధించిన విషయాలను పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలని.. కానీ ఆయన ఎప్పటికీ నేర్చుకోరని విజయ్ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

దివంగత మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్‌కు పుదుచ్చేరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని విజయ్ అన్నారు. రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నో సంవత్సరాల నుంచి 16 తీర్మానాలను ప్రవేశపెట్టినా.. కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. తమ రాజకీయ ప్రయాణాన్ని, ప్రజా సమావేశాలను, ప్రచార ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తున్న డీఎంకే ప్రభుత్వంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ.. చట్టాన్ని వంచుతూ, కుట్రలు, కుతంత్రాలతో కూడిన పథకాలు పన్నుతున్న మోసపూరిత డీఎంకే తమ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ పార్టీని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలకు, పార్టీ సహచరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణ, బాధ్యతతో కూడిన ఉత్సాహవంతులైన యువ కార్యకర్తలు తమపై నిందలు వేసేవారికి గట్టి సమాధానం ఇచ్చారని ప్రశంసించారు. ఈ సభ సక్సెస్  కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో విజయం సాధిస్తామని, ప్రశంసల హారాన్ని అందుకుంటామని తెలిపారు. విజయ్ తొలి బహిరంగ సభ భవిష్యత్తు రాజకీయాలకు ఒక ఆదర్శంగా నిలవనుంది.

Advertisement

ALSO READ: Viral Video: వాళ్లంతా డ్యాన్స్ చేస్తున్నారు.. ఇంతలోనే దారుణం, ఒకేసారి 20 మంది..

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×