అప్పుడే సంతోషం.. అంతలోనే విషాదం.. అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్లంతా.. దు:ఖంలో మునిగిపోయారు. పెళ్లి వేడుక కాస్త విషాద ఘటనగా మారిపోయింది. 2 సంవత్సరాల క్రితం చంబాలో జరిగిన వివాహ వేడుకలో, ప్రజలు కూర్చున్న ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. కానీ. అదృష్టవశాత్తూ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని చంబాలో పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. చుట్టూ పొంగి పొర్లే నీటి లోయల నడుమ గ్రామాలు ఎంతో అందగా ఉంటాయి. అక్కడ జరిగే పెళ్లి వేడుకలు మరింత కనువిందుగా ఉంటాయి. సాంప్రదాయ వివాహాలు బంధుమిత్రుల కోలాహాలం నడుమ కన్నుల పండువగా జరుగుతాయి. పెళ్లి తర్వాత అత్యంత అద్భుతంగా నృత్యాలు చేస్తారు. పెళ్లికి వచ్చిన బంధువులు అంతా ఆ నృత్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత భోజనాలు చేసి.. బరాత్ మొదలు పెడతారు. పెళ్లి వేడుకను జీవితాంతం మర్చిపోలేని రీతిలో జరపుకుంటారు.
రెండు సంవత్సరాల క్రితం చంబాలో ఓ పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఇంటి మీద్దె మీద అంతా కలిసి లయబద్దంగా నృత్యం చేయడం మొదలు పెట్టారు. వచ్చిన బంధువులు అంతా చుట్టు పక్కల కూర్చొని ఆ డ్యాన్సును చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా మిద్దె కుప్ప కూలిపోయింది. బంధువులంతా కింద పడిపోయారు. వారిలో చాలా మంది మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. అప్పట్లో ఈ వార్త మీడియాలో వచ్చింది కూడా. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Accident caught in 4K.
Just 2-3 ays ago during a marriage function in Chamba, the roof of a house suddenly collapsed where people were sitting. Around 20 people were injured but thankfully no major casualty. Now the drone footage of this incident has emerged . pic.twitter.com/U6CIOa4Os0— Nikhil saini (@iNikhilsaini) December 8, 2025
Read Also: వీరి దాంపత్యానికి 83 ఏళ్లు.. ఏకంగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేసిన వృద్ధ జంట!
ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అదృష్టం బాగుంది కాబట్టే, ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కరి ప్రాణాలకు ఏమైనా, పెళ్లి వేడుక అంతా విషాద కార్యక్రమంగా మారిపోయేదంటున్నారు. ఇలాంటి వేడుకలను ఇంటి మీద కాకుండా కింద ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనకు ప్రాణాపాయం తప్పడం సంతోషం అంటున్నారు. లేదంటే వధూవరుల జీవితాంతంతో ఈ ఘటన ఓ తీరని దుఃఖాన్ని మిగిల్చేదంటున్నారు.
Read Also: ఫ్లైట్ రద్దు.. రిసెప్షన్‌కు వెళ్లలేక, ఆన్‌లైన్‌లోనే అక్షింతలు వేయించుకున్న కొత్త జంట!