
Amitabh Bachchan latest news(Cinema news in telugu) :
ఇండియా పేరు భారత్ గా మారుస్తారనే అంశం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలు భారత్ గా మార్చాలని డిమాండ్ చేస్తుంటే.. విపక్షాలు కేంద్ర తీరుపై మండిపడుతున్నాయి. పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో దేశం పేరును భారత్‌గా మాత్రమే స్థిరపర్చేలా ప్రత్యేక బిల్లును తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లెజెండ్ , బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. భారత్ మాతాకీ జై అంటూ బిగ్ ట్వీట్ చేశారు.
అమితాబ్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ పై కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతు నిలిచారు. జయా జీ అంటే మీకు భయం లేదా అని మరికొందరు సరదాగా కామెంట్లు పెట్టారు.
ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధాని మోదీ తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. బానిసత్వానికి సంబంధించిన ప్రతి ముద్రను చెరిపేసుకొంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే G-20 సమ్మిట్ విందు కోసం విదేశీ అథితిల ఆహ్వానలేఖపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడంపై సందేశాలు వ్యక్తమవుతున్నాయి.
దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలని కోరుతూ 2016లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అప్పట్లో జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ UU లలిత్ ధర్మాసనం ఈ పిల్ ను తోసిపుచ్చింది. భారత్ అని పిలిచినా.. ఇండియా అని అన్నా తప్పు లేదని స్పష్టం చేసింది.
2020లో ఇలాగే సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. కానీ పిటిషన్‌ను విజ్ఞప్తిగా మార్చి కేంద్రానికి పంపాలని సూచించింది. ఇండియా, భారత్ ఈ రెండు పేర్లను రాజ్యాంగంలో ఉన్నాయని గుర్తు చేసింది. రాజ్యంగంలోనే ఇండియాను ఇప్పటికే భారత్ అని పేర్కొన్నారని అప్పటి సీజే బోబ్డే స్పష్టం చేశారు.