
Udhayanidhi Stalin latest news(Today’s breaking news in India):
సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ ను పెంచాయి. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన స్వామీజీ పరమహంస ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి తలపై రూ.10 కోట్ల రివార్డు ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ పని ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే.. తానే చేస్తానంటూ హెచ్చరించడం కలకలం రేపుతోంది.
యూపీ స్వామిజీకి ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. తన తల కోసం రూ.10 కోట్లు అవసరం లేదన్నారు. దువ్వుకోవడానికి రూ. 10 దువ్వెన సరిపోతుందని సెటైర్ వేశారు.తనకు అంత ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదన్నారు. బెదిరింపులు తమకు కొత్తేమి కాదని చెప్పారు. బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన నాయకుడు కరుణానిధి మనవడినని స్వామీజీకి కౌంట్ ఇచ్చారు.
మరోవైపు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి తేల్చిచెప్పారు. ప్రజలందరికీ సమాన హక్కలు ఉండాలన్నదే ద్రావిడ మోడల్ లక్ష్యమని స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.