BigTV English

Farmers Protest in Delhi: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి!

Farmers Protest in Delhi: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి!

Two Farmers Died On Khanauri Border: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులు నిరాకరిస్తూ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. హైడ్రాలిక్ క్రేజలు, జేసీబీలు,ప్రొక్లెయినర్స్ తదితర భారీ యంత్రాలను శంభు సరిహద్దులకు తరలించారు రైతులు. దీంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ తరుణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


ఈ క్రమంలోనే రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ కాల్పుకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. జింద్ డేటా సింగ్ వాలా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది రైతులు గాయపడ్డారు. పోలీసులు కొందరు రైతులను అరెస్టు చేసి హర్యానాకు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు రైతులపై లాఠీలు ఝుళిపించారు.

పలువురు రైతులు పొలాల గుండా సరిహద్దు దాటేందుకు యత్నిస్తుండగా పోలీసులు లాఠీచార్జి చేశారు. మరో వైపు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరో వైపు శంభు సరిహద్దుల్లో రైతుల చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల చండీగడ్ లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలు రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అర్జున్ ముండా రైతులను చర్చలకు ఆహ్వానించారు.


Read More: 1000 కార్లు చోరీ చేసి.. జడ్జిగా అవతారం ఎత్తి..

రైతులతో చర్చలకు సిద్దంగా ఉన్నామని అర్జున్ ముండా అన్నారు. పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్దమని ప్రకటించారు. అయితే, కేంద్రంతో చర్చల విషయంలో చర్చల విషయంలో రైతు సంఘాలు ఏకగ్రీవంగా సమ్మతించడం లేదన్నారు.

పలువురు రైతు నేతలు చర్చలకు సిద్దమైనా.. ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఏ సమస్య పరిష్కారం కాలేదని మరికొందరు నేతలు పేర్కొంటున్నారు. చాలా మంది రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా.. యువ రైతులు మాత్రం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేట్లను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related News

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Big Stories

×