BigTV English

FlyOver Collapsed : కుప్ప కూలిన ఫ్లై ఓవర్.. కాంట్రాక్టర్ పై ఆగ్రహం

FlyOver Collapsed : కుప్ప కూలిన ఫ్లై ఓవర్.. కాంట్రాక్టర్ పై ఆగ్రహం

FlyOver Collapsed : మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. చిప్లున్ లోని రత్నగిరి ప్రాంతంలో నిర్మిస్తున్న ముంబై-గోవా ఫోర్ లైన్ హైవే సోమవారం ఉదయం ఉన్నట్టుండి కూలిపోయింది. కొద్దిసేపటికే.. అదే ఫ్లై ఓవర్ పై మరో పోర్షన్ కూడా కూలిపోయింది. ఫ్లై ఓవర్ కూలిన సమయంలో.. ఆ ప్రాంతంలో పెద్దగా జన సంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. కాగా.. ఫ్లై ఓవర్ కూలిన సమయంలో అక్కడే ఉన్న ఒక క్రేన్ మెషీన్ కు నష్టం జరిగింది.


ఉన్నట్టుండి నిర్మాణంలో ఉన్న భారీ ఫ్లై ఓవర్ కుప్పకూలడంతో.. దాని నుంచి పెద్దఎత్తున దుమ్ము, ధూళి వెలువడింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకుని.. నాసిరకం వస్తువులు వాడటం వల్లే కూలిపోయిందని స్థానికులు వాపోతున్నారు. సమయానికి అక్కడ వర్కర్లెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని, లేదంటే ఎంతమంది ప్రాణాలు పోయేవో ఊహకే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Related News

Viral Video: సెల్ఫీకి ఓ వ్యక్తి ప్రయత్నం.. తోసి తిట్టేసిన జయాబచ్చన్, వైరల్ వీడియో

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Big Stories

×