BigTV English

Hamas Leaders: పిట్టల్లా రాలుతున్న హమాస్ నేతలు

Hamas Leaders: పిట్టల్లా రాలుతున్న హమాస్ నేతలు

Hamas Leaders: ఇజ్రాయెల్ సైన్యం హమాస్ వెన్ను విరుస్తోంది. ఆ మిలిటెంట్ సంస్థ కీలక కమాండర్లు, ముఖ్యనేతలు ఒక్కొక్కరిగా పిట్టల్లా రాలిపోతున్నారు. యుద్ధం ఆరంభమైన ఈ పది రోజుల్లోనే ఏడుగురిని హమాస్ కోల్పోయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్), ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ(షిన్ బెట్) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లలో వారు మృతి చెందారు.


ఐడీఎఫ్, షిన్‌బెట్ నిఘా విభాగాల పక్కా సమాచారం మేరకు హమాస్ సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ కమాండర్ ముతాజ్ ఈద్‌ను ఇజ్రాయెల్ దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. కిబ్బుట్జ్ నిరిమ్ ఊచకోతకు కారకుడైన మిలిటెంట్ బెలాల్ అల్ కద్రా అడ్డును తొలగించుకోగలిగారు. దక్షిణ ఖాన్ యూనిస్‌లో నుక్భా కమాండర్ ఆఫ్ ఫోర్స్‌గా అతను వ్యవహరిస్తున్నాడు.

నుక్బా జబల్యా అసాల్ట్ కంపెనీ కమాండర్ అలీ ఖాదీ, హమాస్ పొలిట్ బ్యూరో అంతర్జాతీయ వ్యవహారాల విభాగం హెడ్ జక్రయ్య అబు మామార్, గాజాలో హమాస్ మంత్రి జోడ్ అబు షమ్లా, గాజా సిటీలో హమాస్ వైమానిక విభాగం హెడ్ మురాద్ అబు మురాద్ ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో మ‌ృతి చెందిన ముఖ్యులు.


ఖైదీల మార్పిడి సంప్రదింపుల్లో దిట్ట అయిన ఒసామా అల్-మజిని తాజాగా సోమవారం నాటి దాడుల్లో మరణించారు. ఇక హమాస్‌లో నంబర్-2, అగ్రనేత యాహ్యా సిన్‌వార్‌పైనా ఇజ్రాయెల్ గురి పెట్టింది. హమాస్ గాజా హెడ్ అయిన సిన్‌వార్ తమ ప్రత్యక్ష శత్రువు అని ప్రకటించింది. అతనే కాదు.. అతని బృందం మొత్తాన్ని తుదముట్టిస్తామని ఐడీఎఫ్ స్పష్టం చేస్తోంది.

ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ జరిపిన దాడుల్లో అతడు కీలక పాత్ర పోషించాడనే అనుమానాలు ఉన్నాయి. 1962లో గాజాలోని ఖాన్‌యూనిస్‌లో శరణార్థి శిబిరంలో పుట్టిన సిన్‌వార్.. గాజా వర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్‌లో పట్టా పుచ్చుకున్నాడు. 20 ఏళ్ల పాటు జైలులో మగ్గాడు. 2006లో హమాస్ అపహరించిన గిలియడ్ షాలిత్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్ 1026 మంది ఖైదీలను విడుదల చేసింది. వారిలో సిన్‌వార్ కూడా ఉన్నాడు.

ఆ తర్వాత అతను శరవేగంగా నంబర్.2 స్థానానికి చేరుకున్నాడు. హమాస్‌లో కీలకమైన అల్ కస్సామ్ బ్రిగేడ్లను ఏర్పాటు చేసింది అతనే. ఇజ్రాయెల్‌పై దాడుల్లో సిన్‌వార్ కీలక పాత్ర పోషించినట్టు ఐడీఎఫ్ ఆరోపిస్తోంది. అతడితో పాటు అతడి బృందం మొత్తాన్ని తుడిచిపెట్టేసేందుకు ఇజ్రాయెల్ బలగాలు అదను కోసం ఎదురు చూస్తున్నాయి.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×