E-Paper
Advertisement

Hydraa: సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా.. ఒక నెల తర్వాత కఠిన చర్యలు..?

Hydraa: సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా.. ఒక నెల తర్వాత కఠిన చర్యలు..?
Advertisement

Hydraa: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే విషయంలో హైడ్రా కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. తొలుత వ్యాపారస్తులకు ఫైర్ సేఫ్టీపై అవర్నెస్ కల్పించి, ఆ తర్వాతే కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో షాపుల తనిఖీలు, సీజ్ ప్రక్రియలకు హైడ్రా నెల రోజుల విరామాన్ని ప్రకటించిందనే చెప్పవచ్చు. ఈ నెల రోజుల గడువులో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపులు, వ్యాపార సముదాయాలకు చెందిన యాజమాన్యాలతో కలిసి జాగ్రత్తలూ తీసుకోవాలని హైడ్రా(Hydraa) నిర్ణయించింది. నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు షాపుల యజమానులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు హైడ్రా,(Hydraa) జీహెచ్ఎంసీ(GHMC), ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం కూడా నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఫైర్, పోలీసు విభాగాలతో హైడ్రా తనిఖీలు చేసి 9 షాపుల వరకూ సీజ్ చేసిన సంగతి తెల్సిందే. నెల రోజులు గడువు కావాలని పలు వ్యాపార సంఘాలు, దుకాణదారుల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని హైడ్రా వారికి ఫస్ట్ అవర్నెస్ కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని పేర్కొంటూ ఆ 9 షాపుల యాజమాన్యాల నుంచి అషిడవిట్లు తీసుకున్న తర్వాతే వ్యాపారాలకు అనుమతివ్వాలని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించింది.

అవగాహన కార్యక్రమాలు

పాతబస్తీ, బేగంబజార్, ట్రూప్ బజార్, మదీన సెంటర్ ఇలా ముఖ్యమైన వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అందిరిలో చైతన్యం తీసుకు వస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం తెలిపారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఫైర్ విభాగాలతో కలిసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు రూపొందిస్తున్నామన్నారు. కరపత్రాలలో ఈ నిబంధనలను ప్రచారం చేస్తామన్నారు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్న చోట సమావేశాలు ఏర్పాటు చేసి అందరిలో ఫైర్ సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ?అవగాహన కల్పిస్తామన్నారు. ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగితే అందులో ఉన్న వారు సులభంగా బయటకు వచ్చేలా కారిడార్లు, మెట్ల దారులు స్పష్టంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వస్త్రాలు, ప్లాస్టిక్ వస్తువులు, పెయింట్, ఆయిల్, కెమికల్ డబ్బాలు, యాసిడ్ నిలువలు, టైర్లు, ఫైబర్ వస్తువులు, ఫోమ్ ఇలా మండే స్వభావం ఉన్న వస్తువుల నిల్వలు ఎక్కువ మొత్తంలో లేకుండా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వీడియోలను ప్రదర్శించి, కారణాలను వివరించారు.

Advertisement

Also Read: Podarillu Today Episode : మహాను నమ్మించి మోసం చేసిన చక్రీ.. చక్రీ, మహా రిసెప్షన్ కు ఏర్పాట్లు..షాక్ లో మహా..

సెల్లార్లను గోదాములుగా మార్చొద్దు

సెల్లార్లను ఆయా షాపుల వారు గోదాములుగా మార్చవద్దని హైడ్రా కమిషనర్ సూచించారు. పై అంతస్తుల్లో ప్రమాదం జరిగినా కిందకు దిగి వెళ్లడానికి వీలుంటుందన్న విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. సెల్లార్లలోనే ప్రమాదం జరిగితే అగ్గిలో దూకే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. సెల్లార్ల నిండా స్టాక్ పెట్టి వాటిని కాపాడే క్రమంలో గ్రిల్స్ ఏర్పాటు చేయడం, వాటికి తాళాం వేయడంతో నాంపల్లి ఘటనలో ఐదుగురు మృతికి కారణమైందన్నారు. ఇటీవల తనిఖీల్లో ప్రమాదకరంగా నిల్వలు సెల్లార్లలో గమనించామని, అందుకే సీజ్ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగిస్తే, ట్రాఫిక్ జామ్ లు తగ్గటంతో పాటు కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

Advertisement

Also Read: Municipal Elections: త్వరలో తొర్రూరును దత్తత తీసుకుంటా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×