E-Paper
Advertisement

Central Cabinet: రూ. 8.7 లక్షల కోట్లతో ఇంటింటికీ తాగునీరు.. కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Central Cabinet: రూ. 8.7 లక్షల కోట్లతో ఇంటింటికీ తాగునీరు.. కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
Advertisement

దేశాభివృద్ధికి సంబంధించి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ గడువును 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి 2024 వరకు ప్రాథమికంగా నిర్ణయించిన ఈ పథకం ద్వారా మరిన్ని సేవలు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటివరకు 12.6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ఇంటి వద్దకే ట్యాప్ కనెక్షన్లు అందాయి. ఇకపై కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నాణ్యమైన సేవల పంపిణీపై యంత్రాంగం దృష్టి సారించనుంది.

ఈ బృహత్తర ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని ప్రభుత్వం రూ. 8.7 లక్షల కోట్లకు పెంచింది. పథకం సమర్థవంతమైన అమలు కోసం రాబోయే మూడు నెలల్లో రాష్ట్రాలతో ప్రత్యేక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల నిధుల వినియోగం.. పనుల పర్యవేక్షణ సులభతరం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నివాసానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ గడువు పెంపు కీలకంగా మారనుంది.

Advertisement

రవాణా రంగానికి సంబంధించి ప్రభుత్వం భారీ కేటాయింపులు చేపట్టింది. తమిళనాడులోని మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో పర్యాటకం.. వాణిజ్యం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. రహదారుల విస్తరణలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 2,905 కోట్లు కేటాయించారు. అలాగే సైంథియా-పాకూర్ మధ్య మరో నాలుగు వరుసల రహదారిని రూ. 1,569 కోట్లతో నిర్మించనున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బద్నావర్-థాండియా-తిమర్వాని (NH 752) ఐదు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 3,839 కోట్లు కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు. ఉత్తరప్రదేశ్ వాసులకు ఊరటనిస్తూ జెవార్ విమానాశ్రయం నుంచి ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే ఆరు వరుసల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి రూ. 3,631 కోట్లు మంజూరు చేశారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

Advertisement

ALSO READ: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో ప్రభాకర్ రావుకు ఊరట, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×