Jyoti Malhotra: గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్ పేరుతో తరచూ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయాలను సందర్శించేవారిని సమాచారం. అంతేకాదు హైదరాబాద్, పూరీ ప్రాంతాలతో ఆమెకు లింకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆమె గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టుకు ముందు నుంచే కేంద్ర నిఘా సంస్థలు జ్యోతిపై దృష్టి సారించాయి. ఆమె కదలికలపై ఎప్పటికప్పుడు కన్నేయడం మొదలుపెట్టాయి. అంతా నిర్ధారించుకున్న తర్వాత చివరకు మే 17న అరెస్టు చేశారు.
హర్యానాలోని హిస్సార్‌కు చెందిన ‘ట్రావెల్ విత్ జెఓ’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది జ్యోతి మల్హోత్రా. గతేడాది సెప్టెంబర్‌లో పూరీ ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ ఓ మహిళా యూట్యూబర్‌ను కలిసిందని పూరీ పోలీసులు చెబుతున్న మాట. పూరీకి చెందిన ఆ మహిళ ఇటీవల పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు ప్రయాణించిందని తెలుస్తోంది.
పూరీకి చెందిన ఆ మహిళ భారత్ గురించి పాకిస్థానీ నిఘా వర్గాలకు ఏమైనా సమాచారాన్ని ఇచ్చిందా? లేదా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన నుండి దేశంపై గూఢచర్యానికి ఆమె పాల్పడిందని నిఘా వర్గాలు భావించాయి.
ALSO READ: ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు అరెస్టు
ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ సమయంలో ఉత్తర భారత్ అంతటా విద్యుత్ సరఫరా నిలిపి వేశారని పాక్‌కి చెందినవారితో సంప్రదింపులు చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో పాక్ హైకమిషన్ సిబ్బంది డానిష్‌తో సంప్రదింపులు జరిపింది. మే 13న గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పాక్ అధికారిని భారతదేశం బహిష్కరించింది.
అదేరోజు హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో గార్డుగా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి నౌమాన్ ఎలాహి, కైతాల్ నివాసి దేవేందర్ సింగ్ థిల్లాన్, హిస్సార్ వాసి మల్హోత్రా, నుహ్‌లోని రాజకా ప్రాంతవాసి అర్మాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఎప్పటికప్పుడు జ్యోతితో సంప్రదింపులు జరిపినట్టు గుర్తించాయి దర్యాప్తు బృందాలు.
చివరకు వీరంతా జ్యోతి అండర్‌లో పని చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత మే 17న ఆమెని అరెస్టు చేశారు. జ్యోతి మల్హోత్రా రెండేళ్ల పాకిస్థాన్‌కు వెళ్లింది. అక్కడ డానిష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత అతనితో టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. అతడి సూచన మేరకు అలీ అహ్సాన్‌ని కలిసింది. పాకిస్థాన్‌కు చెందిన నిఘా, రక్షణ వ్యవస్థ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి అతడు పరిచయం చేసినట్లు భావిస్తున్నారు.
జ్యోతి మల్హోత్రా ఆదాయం, ట్రావెలింగ్ ఛార్జీలు పరిశీలిస్తే అనుమానంగా ఉందన్నారు. విదేశీ ప్రయాణాలకు స్పాన్సర్ చేయవచ్చని అంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ జ్యోతి మల్హోత్రా గురించి కొన్ని విషయాలను ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. భారత్ బహిష్కరించిన పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో కలిసి జ్యోతి మల్హోత్రా జనవరి 2025లో పహల్గామ్‌ను సందర్శించడం యాదృచ్చికమా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ISI నిర్వాహకులకు ఆమె సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు కనిపిస్తోందని రాసుకొచ్చారు.
ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లో వెలుగు చూశాయి. రెండేళ్ల కిందట సెప్టెంబరులో ప్రధాని మోదీ హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గవర్నర్, కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈవెంట్‌లో యూట్యూబర్ హంగామా చేసింది. హైదరాబాద్ లో ఆమె ఎవరినైనా కలిసిందా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
Is it a coincidence that u tuber Jyoti Malhotra who was honey trapped by Danish ,a Pakistani High Commission employee ( most probably ISI person) visited Pahalgam in January 2025? She was reportedly passing on sensitive information to ISI handlers. Our intelligence services… pic.twitter.com/kh8qe7yf2N
— Shesh Paul Vaid (@spvaid) May 18, 2025