Manchu Vishnu: మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ పై ఎంత ఫోకస్ పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంలో గొడవలు రోడ్డుకెక్కినా.. వాటిని పట్టించుకోకుండా కన్నప్ప మూవీ పైనే ఫోకస్ చేశాడు విష్ణు. ఇక ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మంచు విష్ణు తన తండ్రి ఆనందమే తనకు ముఖ్యమని తెలిపారు. ఆయన బాధపడిన రోజు తాను బ్రతికున్నా.. లేకున్నా ఒకటే.. ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గొప్ప నటుడిగా మంచి పేరుంది. దాన్ని ఎప్పటికీ డామేజ్ కాకుండా కాపాడుకుంటాను అంటూ విష్ణు తెలిపారు.
ఎన్ని జన్మలెత్తినా ప్రభాస్ రుణం తీర్చుకోలేను – మంచు విష్ణు
అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ.. నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే ఈరోజు నా పతనం కోరుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం నాకు ఎంతో అండగా నిలిచారు అంటూ విష్ణు తెలిపారు. విష్ణు మాట్లాడుతూ.. “నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే నా పతనాన్ని కోరుతుంటే, ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా.. అనేక విషయాలలో నాకు సపోర్టుగా నిలిచింది ప్రభాస్ మాత్రమే. ప్రభాస్ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది” అంటూ ప్రభాస్ పై తనకున్న నమ్మకాన్ని ఇష్టాన్ని తన మాటల రూపంలో తెలియజేశారు మంచు విష్ణు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్ అటు ప్రభాస్ అభిమానులను కూడా కదిలిస్తున్నాయి అని చెప్పవచ్చు.
కన్నప్ప మూవీ పై అనవసరపు రూమర్స్ సృష్టిస్తున్నారు – విష్ణు
కన్నప్ప మూవీ మీద చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. సెన్సార్ బోర్డుకి కూడా కొంతమంది లేఖలు రాశారు. అయితే మేము శ్రీకాళహస్తి ఆలయం అర్చకులు అందరికీ కూడా మా కన్నప్ప మూవీని చూపించాము. ఏదైనా మార్పులు ఉంటే చేయాలని కూడా అడిగాము. కానీ వాళ్లు మాత్రం ఈ సినిమాలో అసలైన భక్తి అంటే ఏంటో చూపించారు. ఒక్క సీన్ కూడా మార్చాల్సిన అవసరం లేదని మాతో చెప్పారు. ఇక ఆ నమ్మకంతోనే జూన్ 27న అభిమానుల ముందుకి తీసుకురాబోతున్నాము. ఈ సినిమాతో నేను పూర్తిగా శివ భక్తుడిగా కూడా మారిపోయాను. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నాను. అందుకే ఇంత ఒత్తిడి ఉన్నా సరే నేను నార్మల్ గా ఉండగలుగుతున్నాను అంటూ తెలిపారు మంచు విష్ణు. ఇకపోతే కన్నప్ప సినిమాను జూన్ 27వ తేదీన భారీ స్థాయిలో 2000 థియేటర్లలో విడుదలకు సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతా బాగానే ఉన్నా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయానికి కన్నప్ప మూవీ విడుదలపై ఏదైనా ప్రభావం పడుతుందేమో అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలి అని, సింగిల్ థియేటర్ లురన్ చేయడం కుదరదని ఎగ్జిబిటర్లు కోరగా.. నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ALSO READ:Faria: మర్డర్ కేసులో హీరోయిన్ ఫరియా అరెస్ట్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ..!