Nusraat Faria:తాజాగా ఒక వార్త సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా (Faria ) ఏకంగా మర్డర్ కేసులో అరెస్ట్ అయిందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది..? ఆమె మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంటి..? అంటూ అందరూ పలు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ హీరోయిన్ ఫరియా థాయిలాండ్ కు వెళ్తుండగా ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బాంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేశాయి.
మర్డర్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ ఫరియా..
మర్డర్ కేస్ మిస్టరీ విషయానికి వస్తే.. గత ఏడాది జులైలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఒక విద్యార్థి హత్యకు గురైంది అన్న విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో నటి ఫరియాతో పాటు దాదాపు 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేస్ కారణంగానే బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రభుత్వం కూడా కూలిపోవడంతో పాటు ఆమె పార్టీకి చెందిన పలువురు నేతలపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనా కూడా దేశం వదిలి పారిపోయి.. భారత్ లో తలదాచుకుంది. ఇక ఈ కేసులోనే ప్రధాన నిందితురాలుగా ఉన్న ఫరియా నుస్రత్ (Faria Nusrat) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు పోలీస్ అధికారి సుజన్ హక్ మాట్లాడుతూ.. “కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్ధించింది. ప్రస్తుతం ఆమెపై వతరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.. ఆమెను అరెస్టు చేసి వతరా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు” అంటూ ఆయన తెలిపారు.
ఫరియా నుస్రత్ సినిమాలు..
ఇక ఫరియా నుస్రత్ విషయానికి వస్తే.. 2015లో వచ్చిన ఆషికి మూవీతో ఆమె కెరియర్ ప్రారంభం అయింది. అందులో అంకుశ హజ్రా సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2016 లో వచ్చిన హీరో 420, 2016 లో వచ్చిన బాద్ షా – ది డాన్, 2017 లో వచ్చిన ప్రేమి ఓ ప్రేమి , 2017లో వచ్చిన బాస్ 2 : బ్యాక్ టు రూల్ వంటి చిత్రాలలో నటించి బాలీవుడ్ ఆడియన్స్ కు మరింత దగ్గర అయింది. 2023లో బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడైన బంగబంధు షేక్ ముజుబుర్ రెహమాన్ జీవిత ఆధారంగా నిర్మించిన “ముజిబ్ : ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్” సినిమాలో షేక్ హసీనా పాత్రను ఈమె పోషించింది.. దిగ్గజ శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అటు బంగ్లాదేశ్ తో పాటు ఇటు భారత్ కూడా కలిసి నిర్మించాయి. ఇందులో అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు. ఇంతటి పేరు దక్కించుకున్న ఈమె ఇప్పుడు మర్డర్ కేసు లో అరెస్ట్ అవ్వడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Manchu Vishnu:రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే నా పతనాన్ని కోరుతున్నారు.. తమ్ముడికి విష్ణు సెటైర్..!