UP Cops – Maha Kumbh Mela : కుంభమేళ సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమంలో కోట్ల మంది స్నానాలు చేస్తూ వారి భక్తి శ్రద్ధలు చాటుకుంటున్నారు. ఆడ, మగ తేడా లేకుండా.. పరమేశ్వరుడిపై భక్తిని చాటుకుంటున్నారు. అలాంటి పవిత్ర ప్రదేశంలోనూ కొందరు దుర్మార్గుల చేష్టలు ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. అలాంటి ఘటనే యూపీలో వెలుగు చూసింది. సంగమ (sangamam) ప్రదేశంలో స్నానాలు చేస్తున్న ఆడపిల్లలు, యువతులు వీడియోలు సేకరించిన కొందరు దుర్మార్గులు.. ఆ వీడియో(Videos)లను అమ్మకానికి పెట్టారు. యువతులు స్నానాలు(Ladys bathing Videos) చేస్తున్న వీడియోలు కావాలంటే డబ్బులు కట్టి యాక్సెస్ పొందండి అంటూ ఏకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్(Social media Postings) లు పెట్టారు. దాంతో.. ఈ పిచ్చి పనులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. యూపీ పోలీసులు(UP Polices) రంగంలోకి దిగారు.
ఈ విషయమై ఇప్పటికే రెండు సోషల్ మీడియా పేజీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. కాగా.. మత సంబంధమైన, ఆధ్యాత్మిక కార్యక్రమానికి చెడు ఉద్దేశ్యాన్ని, తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేందుకు కొందరు కావాలని చేస్తున్న ప్రయత్నాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి వాళ్లు కొందరు కావాలనే సోషల్ మీడియా నిబంధనల్ని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. యూపీలో నెల రోజులకు పైగా సాగుతున్న ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్నానాలు చేస్తున్న యువతులు వీడియోలతో పాటు, వాళ్లు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అకౌంట్లను ఉత్తర్ ప్రదేశ్ సోషల్ మీడియా మానిటరింగ్ బృందాలు గుర్తించినట్లుగా యూపీ పోలీసు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఈ వీడియోల ద్వారా మహిళల వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం కలిగించినట్లేనని చెబుతున్నారు. అందుకే.. కొత్వాలీ కుంభమేళ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపిన అధికారులు.. చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.
మొదటగా యువతులు, ఆడవాళ్లకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను అమ్మకానికి పెట్టిన ఓ ఇన్ స్టాగ్రామ్ ఛానెల్ ను గుర్తించిన పోలీసులు.. దానిపై కేసు నమోదు చేశారు. ఆ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలని ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటాకు పోలీసులు లేఖ రాశారు. ఆ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే విషయాలు తెలిసిన తర్వాత తమ యాక్షన్ ప్రారంభమవుతుందని పోలీసులు తెలిపారు. నిందితుల్ని అరెస్టు చేసి వారికి కచ్చితంగా జైలుకు పంపుతామని హెచ్చరించారు.
ఈ ఘటన జరిగిన రెండు రోజులకే టెలీగ్రామ్ ఛానెల్ ద్వారాను ఇలాంటి అభ్యంతరకర వీడియోలను అమ్మకానికి పెట్టినట్లు వెల్లడైంది. దాంతో.. ఈ కేసులపై యూపీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. తొలుత ఆయా వీడియోలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. వాటిని అప్ లోడ్ చేసిన నిందితుల వివరాలు తెలిసిన తర్వాత ముందుకు వెళ్లనున్నారు. కాగా.. హిందూ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించేలా ఎవరు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారి ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నట్లుగా తెలిపారు.