BigTV English

US Visa : విదేశాల్లోని భారతీయులకు గుడ్ న్యూస్.. స్వదేశం రాకుండానే అమెరికా వీసా..

US Visa : విదేశాల్లోని భారతీయులకు గుడ్ న్యూస్.. స్వదేశం రాకుండానే అమెరికా వీసా..

US Visa : వ్యాపార అవసరాల కోసం, విహారయాత్రల కోసం అమెరికా వెళ్లే భారతీయులు వేగంగా వీసా పొందేందుకు ఆ దేశ రాయబార కార్యాలయం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. బీ1/బీ2 వీసాపై యూఎస్ వెళ్లాలనుకునే విదేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని అమెరికా కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయాల్లో వీసా అపాయింట్‌మెంట్‌ను పొందొచ్చని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. అమెరికా తాజా నిర్ణయం వల్ల విదేశాల్లో ఉండే భారతీయులు అమెరికా వీసా కోసం స్వదేశానికి రావాల్సిన అవసరం ఉండదు. వారు ప్రస్తుతం ఉన్న దేశంలోనే వీసా పొందవచ్చు.


“త్వరలో మీరు విదేశీ ప్రయాణం చేయబోతున్నారా? అయితే వీసా అపాయింట్‌మెంట్‌ మీరు నివసిస్తున్న దేశంలోని అమెరికా కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయం నుంచి పొందొచ్చు. థాయ్‌లాండ్‌లోని భారతీయుల కోసం బ్యాంకాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది’’ అని భారత అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

భారత్‌లో అమెరికా వీసా జారీలో ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జాప్యాన్ని తగ్గించడానికి అమెరికా కొత్త నిబంధన తీసుకొచ్చింది. వీసాలు వేగంగా జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌లోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని పెంచింది. ఇటీవలే 2 లక్షల 50 వేల బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌లను దరఖాస్తుదారుల కోసం అందుబాటులో ఉంచింది.


వీసా అపాయింట్‌మెంట్‌, జారీలో నెలకొన్న జాప్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అమెరికా కాన్సులేట్ అధికారులు చెబుతున్నారు. అదనంగా విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలకు సిబ్బందిని పంపి అక్కడి భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేలాగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ లో బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌ గడువు దాదాపు వెయ్యి రోజులు ఉండటంతో భారత్‌లోని అమెరికన్‌ రాయబార కార్యాలయం ఈ చర్యలు చేపట్టింది.

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×