E-Paper
Advertisement

Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం

Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం
Advertisement

Uttam Kumar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనసభ ఈ నెలాఖరు నాటికి రద్దు అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ మతపరంగా విభజిస్తోందని మండిపడ్డారు.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పథకం, మట్టి, ఇసుక తవ్వకాలు, మద్యం సిండికేట్ లో కోదాడ ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.

Advertisement

శాసనసభ రద్దు అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన ఈ కామెంట్స్ చేశారో ఎవరికీ అర్థం కావడంలేదు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×