Big Stories

Vijay Thalapathy: నీట్‌పై దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు !

Vijay Thalapathy: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళగ వెట్రి కజగం వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ హీరో విజయ్ గళం విప్పారు. నీట్ నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానానికి విజయ్ మద్దతు ప్రకటించారు. 10, 12 తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, విద్యార్థులను ఉద్దేశించి విజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగానే నీట్ అంశంపై విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను  రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

తమిళనాడులో పేదలు గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నీట్ పరీక్షల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. 1975లో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారని తెలిపారు. రాష్ట్రాల హక్కులకు ఇది విరుద్ధమని అన్నారు. రాష్ట్ర సెలబస్‌లో స్థానిక భాషలో చదివిన విద్యార్థి NCERT పార్యాంశాల ఆధారంగా రూపొందించిన సెంట్రల్ పరీక్షలో ఎలా రాణించగలడని ప్రశ్నించారు. పాఠ్య ప్రణాళిక రాష్ట్ర అంశంగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజల భావోద్వేగాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -

విశ్వసనీయత లేదు:

స్థానిక భాషలో సిలబస్ చదివిన విద్యార్థులు ఎన్‌సీఈ‌ఆర్‌టీ ఆధారిత పరీక్షలకు ఎలా సిద్ధం అవుతారని.. గ్రామీణ విద్యర్థుల కోణం నుంచి ఆలోచించాలని కోరారు. నీట్‌లో అవకతవకలు జరిగాయన్న వార్తలు రావడంతో నీట్ పరీక్ష పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిందని తెలిపారు. ఇకపై నీట్ అవసరం లేదని అన్నారు. నీట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని అన్నారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి రాష్ట్ర జాబితాలోకి మార్చాలన్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు.

గత వారం అరియలూర్, కోయంబత్తూర్, ధర్మపురి, దిండుగల్, కృష్ణగిరి, మధురై, నమక్కల్, నీలిగిరి, రామనాథపురం, సేలం, శివగంగై, తేని, తుత్తుకుడితో పాటు పలు ప్రాంతాల విద్యార్థులతో విజయ్ సమావేశమయ్యారు. జూలై 3న విజయ్ జిల్లాలైన చెన్నై, కడలూరు, కళ్లకురిచ్చి కాంచీపురం, కారైకాల్, మైలదుత్తురై, నాగపట్నం, పెరంబలూరు, పుదుచ్చేరి, రాణిపేట్ విద్యార్థులను సన్మానించారు.

సమావేశంలో విజయ్ విద్యార్థులు హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం అని చెప్పారు. కొంతమంది విద్యార్థులు వారి భవిష్యత్తు ఆకాంక్షలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారని అన్నారు. మరికొందరికి మార్గదర్శకత్వం అవసరం అని చెప్పారు. అలాంటి వారు సలహా కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కెరీర్ కౌన్సిలర్ లను సంప్రదించాలని సూచించారు.

Also Read: 132 సీట్ల బస్సు.. విమానం తరహా సౌకర్యాలు: నితిన్ గడ్కరీ

విద్యార్థులు వారు ఎంచుకున్న రంగాల్లో తమ వంతు కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపారు. విద్యార్థులు తమ స్నేహితులను తెలివిగా ఎంచుకోవాలని అన్నారు. ప్రతికూల ప్రభావం నుంచి స్నేహితులను కాపాడుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి స్వీయ క్రమశిక్షణ ఉండాలన్నారు.నిర్ణీత లక్ష్యం ప్రకారం చదివి ఉన్నత స్థానంలో ఉండాలని తెలిపారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News