BigTV English

Champai Soren Resigned as Jharkhand CM: ఝార్కండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా.. హేమంత్ సోరెన్‌కు లైన్ క్లియర్..

Champai Soren Resigned as Jharkhand CM: ఝార్కండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా.. హేమంత్ సోరెన్‌కు లైన్ క్లియర్..

Champai Soren Resigned as Jharkhand CM: ఝార్కండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు చంపై సోరెన్ తన రాజీనామాను సమర్పించారు. దీంతో ఝార్కండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయ్యింది.


బుధవారం తెల్లవారుజామున చంపై సోరెన్ ఇంట్లో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేఎంఎం శాసనసభాపక్షనేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు ఐదు నెలల తర్వాత గత నెల 28న రాంచీ హైకోర్టు హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తర్వాత ఫిబ్రవరి రెండున చంపై సోరెన్ ఝార్కండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


Also Read: భూ కుంభకోణం కేసు.. ఝార్ఖండ్ మాజీ సీఎంకు బెయిల్.. 5 నెలల తర్వాత బయటకు..

హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తర్వాత ఫిబ్రవరి రెండున చంపై సోరెన్ ఝార్కండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బుధవారం సాయంత్రం రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించిన తర్వాత చంపై సోరెన్ మాట్లాడారు. నాయకత్వం మారినప్పుడు.. బాధ్యతలు అప్పగించారని అన్నారు. హేమంత్ సోరెన్ తిరిగొచ్చారని.. కూటమి నాయకుడిగా సోరెన్‌ను ఎన్నుకున్నామని.. కూటమి నిర్ణయంతోనే రాజీనామా చేశానని అన్నారు చంపై సోరెన్.

ఝార్ఖండ్‌లో JMM, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్‌లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Big Stories

×