Big Stories

Kejriwal Hindu : కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీదేవి.. కేజ్రీవాల్ ‘హిందూ’ కార్డ్!

Kejriwal Hindu : కరెన్సీ నోట్లపై కేవలం గాంధీ బొమ్మనేనా? గాంధీతో పాటు లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు సైతం ముద్రించాలి. లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆమె అనుగ్రహం లభిస్తుంది. వినాయకుడి బొమ్మతో ప్రజల కష్టాలు తొలగుతాయి. అందుకే, ఇకపై కొత్తగా ముద్రించే నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై గణేశుడి చిత్రం ముద్రించగా.. మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కామెంట్స్ దేశంలో చర్చనీయాంశమైంది.

- Advertisement -

కేజ్రీవాల్ ఉద్దేశ్యం బీజేపీని కార్నర్ చేయడమే అంటున్నారు. హిందూ కార్డ్ ప్రయోగించి త్వరలో జరిగే గుజరాత్ ఎన్నికల్లో లబ్ది పొందాలనేది ఆయన ఎత్తుగడ అంటూ కమలనాథులు మండిపడుతున్నారు. లౌకిక దేశంలో ఒక మత దేవుళ్ల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రించడమంటే అంతఈజీగా అయ్యే పనేం కాదు. హిందూ దేవుళ్ల బొమ్మలు ముద్రిస్తే.. మరి, మిగతా మతాల సింబల్స్ మాటేంటి? ఇదంతా చాలా వివాదాస్పద అంశం కాబట్టే.. కావాలనే ఆప్ అధినేత ఈ డిమాండ్ తీసుకొచ్చారని అంటున్నారు. ఎలాగూ అయ్యేది కాదనే విషయం తెలిసే.. కమలనాథులను రాజకీయంగా ఇబ్బందిపెట్టాలనేది ఆప్ మాస్టర్ ప్లాన్ లా ఉంది.

- Advertisement -

గతంలోనూ కేజ్రీవాల్ హిందుత్వ కార్డును ప్రముఖంగా ప్రయోగించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. హనుమాన్ చాలీసా సవాల్ చేసి రాజకీయంగా పైచేయి సాధించారు. మీడియా సమక్షంలో హనుమాన్ చాలీసాను చదివి వినిపించి.. తానుసైతం కరుడుకట్టిన హిందువేననే మెసేజ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగట్టారు. హిందుత్వ రాజకీయాలు చేసే బీజేపీకి.. హిందుత్వంతోనే చెక్ పెట్టి శభాష్ అనిపించుకున్నారు. ఢిల్లీలో ఆ స్ట్రాటజీ బాగా వర్కవుట్ కావడంతో.. అలాంటిదే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలంటూ మరో స్ట్రాటజీని ప్రస్తుత గుజరాత్ ఎలక్షన్ టైమ్ లో తెరపైకి తీసుకొచ్చి మైండ్ గేమ్ మొదలుపెట్టారు అరవింద్ కేజ్రీవాల్. మరి, ఈ ఎత్తుగడ ఈసారి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో? బీజేపీని ఎంతగా దెబ్బతీస్తుందో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News