India China : భారత్ చైనా మధ్య ఉన్న విభేదాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని చైనా రాయబారి సున్ విడాంగ్ స్పష్టం చేశారు. రాయబారిగా ఆయన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య విభేదాలు ఉండడం వాస్తవమే అయితే వాటిని పరిశ్కరించుకోవడం కూడా అవసరం. ఇరు దేశాలు కలిసి సమిష్టి ప్రయోజనం కోసం పనిచేయడం అన్నింటికంటే ముఖ్యం అన్నారు.
భారత్ చైనా మధ్య అవగాహన మరింత విస్తృతంగా ఉండాలని సున్ విడాంగ్ అన్నారు. చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం చేసుకొనే విధంగా ఉండాలన్నారు. భారత్ చైనా మధ్య పశ్చిమ దేశాల రాజకీయాలను చొప్పించవద్దని.. అలా చేస్తే పరస్పరం విభేదించుకోవలసి వస్తుందని అన్నారు. అయితే గాల్వన్ లోయ దాడి జరిగినప్పుడు చైనా రాయబారిగా సున్ విడాంగ్ కొనసాగారు.