BigTV English

Vinesh Phogat: సత్యమే గెలిచింది… హర్యానా ఎన్నికల్లో మాజీ రెజ్లర్ వినేష్ ఫొగట్ విజయం

Vinesh Phogat: సత్యమే గెలిచింది… హర్యానా ఎన్నికల్లో మాజీ రెజ్లర్ వినేష్ ఫొగట్ విజయం

Vinesh Phogat Winning Debut Election From Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఘన విజయం సాధించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమె.. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై దాదాపు 6వేల మెజారిటీతో గెలుపొందారు. యోగేష్ బైరాగి రెండో స్థానంలో, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వినేష్ ఫొగట్ సంబరాల్లో మునిగిపోయారు. అయితే, మొదట ఆధిక్యంలో కొనసాగిన ఆమె.. తర్వాత కొన్ని రౌండ్ల పాటు వెనుకబడ్డారు. కానీ చివరికి విజయం సాధించారు.


ఈ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్ గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హర్యానా ఎన్నికల్లో సత్యమే గెలిచిందన్నారు. ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించిందన్నారు. ఇది ప్రజల పోరాటమని, అందరూ గెలిచారన్నారు. ప్రజలకు రుణపడి ఉంటా.. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రేమ, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

Also Read: హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఆ రాష్ట్రానికి నూతన సీఎం ఆయనేనంటా!


దేశంలో ఓ మహిళ పోరాట మార్గాన్ని ఎంచుకుని గెలిచిందన్నారు. దీంతో ఎప్పటికీ మహిళల పోరాటం వృథా కాదని ప్రజలు నిరూపించారన్నారు. కాగా, జాట్ మెజార్టీగా ఉన్న సీట్లను బీజేపీ గెలుచుకుందని బ్రిజ్ భూషణ్ అన్నారు. రెజ్లర్ల ఆందోళనలో పాల్గొన్న కొంతమంది రెజ్లర్లను హర్యానా రాష్ట్ర హీరోలుగా చెప్పలేమని వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి అన్నారు. హర్యానాలో ఆమె గెలిచినా, అది కాంగ్రెస్ పార్టీ గెలుపు అనే విషయాన్న గుర్తించాలన్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×