BigTV English

Samantha: వారే నా ఫ్యామిలీ..స్టేజి మీదనే ఏడ్చేసిన సమంత

Samantha: వారే నా ఫ్యామిలీ..స్టేజి మీదనే ఏడ్చేసిన సమంత

Samantha: సమంత.. సినిమాలు చేసినా.. చేయకపోయినా  సోషల్ మీడియాలో మాత్రం టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది.  ఆమె గురించి  ఏ వార్త అయినా ఇట్టే వైరల్ గా మారుతుంది. ఇక గత వారం రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వలన మరోసారి సమంత పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. నాగ చైతన్యతో సమంత విడిపోవడానికి కారణం నాగార్జుననే అని ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి సామ్  విడాకులు టాపిక్ హైలైట్ గా మారింది.


ఇక ఈ వివాదం తరువాత  మొదటిసారి సమంత.. మీడియా ముందుకు వచ్చింది.  బాలీవుడ్  స్టార్ హీరోయిన్ అలియా భట్  ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సామ్ ముఖ్య అతిథిగా  హాజరయ్యింది. ఇక ఈ ఈవెంట్ లో సమంత ఎమోషనల్ అయ్యింది. ” చాలా రోజుల తరువాత అభిమానులందరినీ కలుస్తున్నాను. అలియా.. నీకు తెలుసు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. నిజం చెప్పాలంటే.. హీరోయిన్లందరికి ఒక బాధ్యత ఉంది. అప్పుడప్పుడు  మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు.. మీ కథలో మీరే హీరోలు అని గుర్తుచేసే బాధ్యత. అలియా కొన్నిసార్లు గుర్తుచేస్తుంది.. మన సినిమాలకు మనమే హీరోలు అని. ఈ సినిమాకు ఆమె నిర్మాత కూడా మారింది. ఆ రిస్క్ ను తీసుకొని కూడా ఈ సినిమా చేసింది.

ఇక ఈ ఈవెంట్ కు పిలిచినప్పుడు నాకు ఒక పర్సనల్ కనెక్ట్ అనిపించింది. ఈ ఫస్ట్ విబరుస లో కూర్చున్నవారందరు నా జిగ్రాలు. రాహుల్ రవీందర్ నాకు 15 ఏళ్లుగా నాకు తెలుసు.. త్రివిక్రమ్  గారితో మూడు సినిమాలు. వీరిద్దరూ లేకుండా నా కెరీర్ ఇలా ఉండేది కాదు. నా బిగ్గెస్ట్ హిట్స్  లో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ లోనిదే. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాహుల్ హిందీ డెబ్యూకి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.


రానా.. నా బ్రదర్.  గత నెల ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాను ప్రజెంట్ చేశారు. నెల తిరక్కముందే మరో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. నాకు తెలిసి రానా లాంటి బ్రదర్ ఉండాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడకు రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు  ప్రేమిస్తే ఎలా ఉంటుందో అలియా.. ఆర్ఆర్ఆర్ తరువాత కొంత తెలుసుకుంది. జిగ్రా తరువాత పూర్తిగా తెలుసుకుంటారు.

నేను ఎవరు.. నేను ఏంటి అనేది అందరికి తెల్సింది అంటే అది కేవలం తెలుగు ప్రేక్షకుల వలనే. మీ ప్రేమ వలనే ఎదిగాను.. మీరే నా ఫ్యామిలీ. దానికి నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను. జిగ్రా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జిగ్రా టీమ్” అని ముగించింది. ఇక సామ్ అలా స్టేజిపై ఎమోషనల్ గా మాట్లాడంతో నెటిజన్స్.. సామ్ నీకు మేము ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. త్వరలోనే సామ్ నటించిన  వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీ రిలీజ్ కానుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×