BigTV English

PM Modi: హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఆ రాష్ట్రానికి నూతన సీఎం ఆయనేనంటా!

PM Modi: హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఆ రాష్ట్రానికి నూతన సీఎం ఆయనేనంటా!

PM Modi Reaction on Haryana Election Results : హర్యానా ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఇటు కాంగ్రెస్ పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు విడుదలైన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘దేశ వ్యతిరేక రాజకీయాలను సహీంచబోమని హర్యానా ప్రజలు తేల్చి చెప్పారు. హర్యానా రైతులు తాము బీజేపీ వెంటనే ఉన్నామని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పరాన్న జీవి పార్టీగా మారిపోయింది. కీలక వ్యవస్థలపై కాంగ్రెస్ మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మన వ్యవస్థల పారదర్శకతను కాంగ్రెస్ వేలెత్తి చూపుతోంది. బలహీన వర్గాలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూస్తోంది. కులం పేరుతో కాంగ్రెస్ విషాన్ని చిమ్ముతుంది. కాంగ్రెస్ దేశంలో ప్రమాదకరమైన ఆటను మొదలు పెట్టింది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.


Also Read: హర్యానా ఎన్నికల ఫలితాలపై జైరాం రమేష్ హాట్ కామెంట్స్… వామ్మో ఇలా అనేశాడేంటి..?

ఇదిలా ఉంటే.. జమ్మూకాశ్మీర్, హర్యానాలో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కాగా, జమ్మూలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీకి 20కి పైగా సీట్లు వచ్చాయి. ఇటు పీడీపీ పార్టీకి ఈసారి ఎప్పుడూ లేనంతగా తక్కువగా సీట్లు వచ్చాయి. అటు హర్యానాలో బీజేపీకి ప్రజలు పట్టంకట్టారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి పార్టీలకు దాదాపుగా దగ్గర సీట్లు వచ్చాయి. 50కి పైగా సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో హర్యానా బీజేపీ నేతలకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అక్కడి బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.


Also Read: అమెజాన్‌లో అందుబాటులో ఉన్న NCERT పుస్తకాలు.. ధర తక్కువనా.. ఎక్కువనా..?

అయితే, హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మరో అంశంపై తీవ్రంగా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. అక్కడ ఎవరికి సీఎం పదవి వరించనున్నది.. ఎవరెవరికి మంత్రులుగా అవకాశం దక్కనున్నదనేదానిపై చర్చ నడుస్తున్నది. ఇటు బీజేపీ పెద్దలు కూడా ఇదే విషయమై చర్చలు ఇప్పటికే ప్రారంభించారంటా. ఎవరికైతే ఆ కీలక బాధ్యతలను అప్పజెప్పితే ప్రజలకు మంచి పాలన అందించి, పార్టీ బలోపేతానికి, మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తారో వారికే అప్పజెప్పాలనే ఆలోచనతో పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గెలిచిన బీజేపీ నేతలు ఇప్పటికే ఆ పదవుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం హర్యానా బీజేపీ కీలక నేతలతోనూ మాట్లాడుతుందంటా.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×