E-Paper
Advertisement

Rahul Gandhi News :నేడు రాహుల్ గాంధీ లోక్ సభలో అడుగు పెడతారా..? స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ..

Rahul Gandhi News :నేడు రాహుల్ గాంధీ లోక్ సభలో అడుగు పెడతారా..? స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ..
Advertisement
Rahul Gandhi News

Rahul Gandhi News :వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొంటారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణకు అవసరమైన పత్రాలను సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ పరిశీలించనుంది. అనంతరం మెరిట్ ఆధారిత నిర్ణయం తీసుకుని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంతకం చేయనున్నారు.

Advertisement

పరువు నష్టం కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌లో అడుగుపెతారా లేదా దానిపై ఉత్కంఠను రేపుతోంది. అనర్హత రద్దుపై లోక్‌సభ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. లోక్‌సభ సభ్యత్వాన్ని తొలగించడంలో ఉన్న తొందర, పునరుద్ధరించడంలో ఎందుకు లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నాయి. తీర్పుపై స్టే విధిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీలను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. దీంతోపాటు ఆయనపై వేసిన అనర్హత వేటును రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసి ఓం బిర్లా టేబుల్ ముందుంచారు. ఇక ఆయన సంతకం చేయడమే తరువాయి. దాని తర్వాతే రాహుల్ సభలోకి వెళ్లేందుకు వీలుంటుంది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసినంత వేగంగానే దానిని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Related News

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

Big Stories

Advertisement
×