AP New Pensions: కొత్త పించన్ల జారీకి కూటమి వ్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. కొత్తగా పెన్షన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు సర్కార్ పేర్కోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్ల నుంచి పెన్షన్ దరఖాస్తులను స్వీకరించనున్న అధికారులు తెలిపారు. రేపటి నుండి మొదలుకుని ఈ నెల 16వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేయనున్నారు. వివిధ వర్గాల వారికి దశలవారీగా కొత్త పెన్షన్లు అమలు చేసేలా కార్యాచరణ చేసామని, దరఖాస్తుల స్వీకరణ మొదలుకుని లబ్దిదారుల ఎంపిక వరకు షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేసారు. సెప్టెంబర్ 7–16 దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్ 17 నుండి 21 వరకు జనరల్ వెరిఫికేషన్ చేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 22 నుండి 24వరకు ఫిజికల్, శాఖాపరమైన ధృవీకరణ, అర్హత నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ 25 నుండి 26 వరకు సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ జరగనుంది.
Also read: ‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?
దీంతో అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా పింఛన్ల మంజూరు చేయనున్నట్టు అధికారులు పేర్కోన్నారు. ప్రస్తుతం 61,92,396 మంది పింఛనుదారులకు నెలకు రూ.2,694 కోట్ల మేర పింఛన్లు పంపిణి చేయనున్నారు. రాష్ట్ర జనాభాలో 12.88 శాతం మంది సామాజిక భద్రత పింఛన్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. పింఛన్ల కోసం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.73,508 కోట్లు పంపిణీ చేసినటట్టు కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది.
Also read: కాంగ్రెస్ వ్యూహంలో గట్టిగా చిక్కుకున్న బీఆర్‌ఎస్.. కల్వకుంట్ల కవిత సంచలనం