Big Stories

CM : సిద్ధూకు పట్టం కడతారా..? డీకేకు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా..? సీఎం ఎవరు..?

Karnataka CM Decision Live(Telugu Breaking News): కర్ణాటకలో సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సీఎల్పీ సమావేశంలో క్లా రిటీ రాలేదు. ఎమ్మెల్యేల తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని సిద్ధరామయ్య పట్టుబట్టినా అందుకు డీకే శివకుమార్ అంగీకరించలేదు. ఈ నిర్ణయాన్ని అధిష్ఠానానికి వదిలేయాలని పట్టుబట్టారు.

- Advertisement -

సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేల్లో బలం ఉంది. సిద్ధూనే ముఖ్యమంత్రి కావాలని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో డీకే అప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్లానని డీకే అన్నారు. తనకోసం ఏమీ కోరుకోలేదన్నారు. తనకు, సిద్ధూకు మధ్య ఏమాత్రం విభేదాల్లేవని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారనేదాని కంటే ఎవరు కష్టపడ్డారనేదానికి ప్రాధాన్యం ఇవ్వాలని తన మనసులో మాటను చెప్పకనే చెప్పారు. పార్టీ కోసమే తాను శ్రమించానని చెప్పుకొచ్చారు. చాలా కష్టాలు పడ్డానని, సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు.

- Advertisement -

సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్‌ బయట సిద్ధూ, డీకే మద్దతుదారులు హడావిడి చేశారు. సీఎం నినాదాలతో హోరెత్తించారు. సిద్ధూ, డీకే నివాసాల వద్ద కాబోయే సీఎం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అటు డీకేను సీఎం చేయాలని వొక్కలిగలు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా మరో ప్రతిపాదనను సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారు. సీఎం పదవిని పంచుకుందామని ప్రతిపాదన చేశారు. తాను రెండేళ్లు పదవిలో కొనసాగుతానని .. డీకే శివకుమార్ 3 ఏళ్లు సీఎంగా ఉంటారని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు డీకే అంగీకరించలేదు. అంటే తనకే సీఎం పదవి ఇవ్వాలన్న పట్టుదలతో శివకుమార్ ఉన్నారని స్పష్టమవుతోంది.

ఏడుసార్లు ఎంపీగా చేసిన కె.హెచ్‌.మునియప్ప, మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, లింగాయత్ నేత ఎం.బి.పాటిల్‌ కూడా సీఎం పదవికి పోటీపడుతున్నారు. అయితే వారికి అవకాశాలు లేనట్టే. కర్ణాటక శాసనసభ గడువు ఈ నెల 24తో ముగుస్తుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి సీఎంగా అవకాశం కల్పిస్తుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News