Madhya Pradesh: హోటల్ గదిలో భర్తను మరొక మహిళలో చూసింది భార్య. ఆ విధంగా చూసి తట్టుకోలేక పోయింది. నా కాపురంలో చిచ్చురేపడంతో ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయింది. బెడ్ మీదకు ఎక్కి, భర్తతోపాటు ఆ మహిళ చెంప ఛెళ్లు మనిపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగింది.
అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. అందుకు హోటల్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఎగ్జాంఫుల్. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భర్త మరో మహిళతో హోటల్ గదిలో ఉండటాన్ని చూసింది భార్య. దీంతో తట్టుకోలేక భార్యకు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తన కాపురంలో చిచ్చుపెట్టందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్య గది తలుపు తెరిచి బెడ్‌పై ఉన్న తన భర్త, సదరు మహిళను ఎడాపెడా చెంప దెబ్బలు కొట్టింది.
దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇరు పక్షాలను శాంతింప జేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసుల నివేదికల ప్రకారం.. సవిత భర్త అరుణ్ యాదవ్-జ్యోతిల మధ్య వివాహేతర సంబంధం ఉందని చెబుతోంది. ఏడాదిగా వీరిద్దరు వివాహేతర సంబంధంలో ఉన్నట్లు ఆరోపించింది. ఆ అనుమానం కాస్త పెనుభూతంగా మారింది.
చివరకు రెండురోజుల కిందట అరుణ్ యాదవ్- తన ప్రియురాలు ఓ హోటల్‌లో కలుసుకున్నారు. ఈ విషయాన్ని సవిత.. తన భర్త మొబైల్ చాట్ ద్వారా తెలుసుకుంది. ఆ తర్వాత శారదా చౌక్‌లో ఉన్న హోటల్‌లో తన భర్త అరుణ్‌ను చూసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అరుణ్-జ్యోతి హోటల్‌లోని 103వ నంబర్ గదిలోకి ఎంట్రీ ఇచ్చింది. తలుపు తెరిచి వారిద్దరినీ ఆ విధంగా చూడగానే సవితకు కోపం ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది.
ALSO READ: ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
గది లోపల ముగ్గురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది ముదిరిపోవడంతో చెంపదెబ్బలకు దారితీసింది. తన భర్త మరో మహిళకు దగ్గర కావడం వల్ల తనకు దూరమయ్యాడని చెబుతోంది. జ్యోతి.. అరుణ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇరుపక్షాల నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇరు పక్షాల మధ్య వివాదాన్ని పరిష్కరించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందింతే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
जबलपुर के होटल में पति को दूसरी महिला के साथ देखने का पत्नी ने किया दावा। फोन पर मिले संदेशों के बाद महिला को हुआ था शक।#JabalpurNews #MPNews #viralvídeo pic.twitter.com/aYOEWqziZJ
— gnewshunt.com (@gnewshunt) October 5, 2026