E-Paper
Advertisement

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి
Advertisement

Shai Hope Counter To Shubman Gill:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య నిన్న రాంచి వేదికగా జరిగిన రెండో టి20 లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్ గిల్ కు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు షాయ్ హోప్. నువ్వు ఆ రోజున డబుల్ సెంచరీ చేస్తే… నేను సెంచరీ చేసి తమ జట్టును గెలిపించుకున్నానని కౌంటర్ ఇస్తూ… 250 టార్గెట్ తనకు చాలా చిన్నదే అంటూ పోస్ట్ పెట్టాడు. నువ్వు గెలికినందుకే నాకు కోపం వచ్చింది… అందుకే శ్రేయస్ అయ్యర్ సేనపై పగ తీర్చుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో గిల్ వర్సెస్ వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సోషల్ మీడియా వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఇంతకు గిల్ వర్సెస్ షాయ్ హోప్ సోషల్ మీడియా వార్ ఏంటి ?

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మొన్నటి వరకు వన్డే సిరీస్ జరిగింది. అందులో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. అయితే రెండవ వ‌న్డే సందర్భంగా వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 405 పరుగుల భారీ టార్గెట్ టీం ఇండియా ముందు పెట్టింది. ఈ టార్గెట్ ను టీమిండియా అవలీలగా చేదించింది. రోహిత్ శర్మ సెంచరీ చేయగా కెప్టెన్ గిల్ 223 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ సమయంలో గిల్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత తనకు 406 పరుగుల టార్గెట్ చాలా చిన్నదే అంటూ అర్థం వచ్చేలా…కూల్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

అయితే దీన్ని మనసులో పెట్టుకున్న వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్…. శ్రేయస్ అయ్యర్ సేనపై పగ తీర్చుకున్నాడు. నిన్న టీమిండియా 250 పరుగుల టార్గెట్ పెట్టినప్పటికీ.. ఒంటి చేత్తో సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత… తమకు కూడా 250 టార్గెట్ చాలా వన్డే కెప్టెన్ గిల్ కు కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరు పోస్టులు వైరల్ గా మారాయి. గిల్ అనవసరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ను రెచ్చగొట్టాడని కొంతమంది ఫైర్ అవుతున్నారు. గిల్ చేసిన పనికి శ్రేయస్ అయ్యర్ బలి అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

 

Related News

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

సంజు జోలికి వస్తే తాట తీస్తా, చేతకాకపోతే తప్పుకో…గంభీర్‌కు డీకే వార్నింగ్

పులి లాంటి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయింది..ఒంటి చేత్తో ఓడిస్తా

Big Stories

Advertisement
×