E-Paper
Advertisement

ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్

ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్
Advertisement

Friend App Scam: ఈ రోజుల్లో సోషల్ మీడియా, రకరకాల ఫ్రెండ్‌షిప్ యాప్‌ల ద్వారా కొత్త పరిచయాలు పెంచుకోవడం చాలా సాధారణమైపోయింది. అయితే, అవతలి వ్యక్తుల మాటలను, వారు చూపించే రంగుల ప్రపంచాన్ని గుడ్డిగా నమ్మితే ఎలాంటి చిక్కుల్లో పడతామో చెప్పడానికి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనే ఒక నిదర్శనం. కోటీశ్వరుడినంటూ నమ్మించి, ఓ మహిళ మంగళసూత్రాన్ని కాజేసిన కారు మెకానిక్‌ను అల్లాపూర్ పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు.

లగ్జరీ కార్లతో మాయాజాలం

Advertisement

ఏలూరు జిల్లా కుక్కునూర్ మండలం ఇబ్రహీంపేటకు చెందిన 25 ఏళ్ల పేట వసంత్ కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కానీ, తనకున్న సాధారణ జీవితంతో వసంత్ సంతృప్తి చెందలేదు. అందుకు సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారి తొక్కాడు. ముఖ్యంగా ఆర్థికంగా స్థితిమంతులైన మహిళలే లక్ష్యంగా ఒక ఫ్రెండ్ యాప్‌లో వల విసిరాడు. రిపేర్ కోసం గ్యారేజీకి వచ్చే ఖరీదైన కార్ల ముందు ఫోజులిస్తూ, నోట్ల కట్టల వీడియోలు తీసి తాను పెద్ద కోటీశ్వరుడినని నమ్మించేవాడు.

నమ్మించి.. మంగళసూత్రంతో పరార్

Advertisement

ఈ క్రమంలోనే పర్వత్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళకు వసంత్‌తో యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకునే వారు. తన వద్ద ఉన్న లగ్జరీ కార్లన్నీ సొంతవేనని ఆమెను పూర్తిగా నమ్మించాడు. మాటలతో మాయ చేసి, ఒకరోజు నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెను తన కారులో నగరంలోని పలు ప్రాంతాలకు తిప్పి మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత అసలు ప్లాన్ అమలు చేశాడు. అత్యవసరమని చెప్పి, మరుసటి రోజే తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికి ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.

టెక్నాలజీతో పట్టుకున్న పోలీసులు

మరుసటి రోజు వసంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే అల్లాపూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాల్ డేటా సహాయంతో నిందితుడి ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 20 గ్రాముల మంగళసూత్రం, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.

Also Read: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రానున్న నాలుగు రోజులపాటు..

Tags

Related News

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రానున్న నాలుగు రోజులపాటు..

కారును లారీ ఢీ కొట్టి.. హైదరాబాద్ దంపతులు మృతి, ఖమ్మం జిల్లా గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘటన

పల్నాడు గ్రిడ్ ప్రాజెక్టుపై.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు!

అగ్రి యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త కోర్సులు ప్రారంభం!

నెలకు రూ.లక్ష వేతనంతో.. 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ మీ సేవలో..?

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. పథకానికి 50 కోట్లు కేటాయింపు?

Big Stories

Advertisement
×