Nataraj Master:బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో గత తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులకు ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈ సీజన్ మాత్రం విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆడవారు అని కూడా చూడకుండా వారిపై అసభ్యకర పదజాలంతో ప్రవర్తించడం, మానవత్వం లేకుండా బిహేవ్ చేయడం, కోట్లాదిమంది ప్రజలు చూస్తున్నారు అనే ఆలోచన కూడా లేకుండా తప్పుడు మాటలతో రెచ్చిపోవడం చూస్తుంటే.. ఈ సీజన్ పై కొంతమంది ఆడియన్స్ లో వ్యతిరేకత కూడా నెలకొంటుంది. అసలు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారా? లేక రౌడీలను పంపించారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా నటరాజ్ మాస్టర్ భార్య, ప్రముఖ డాన్సర్ నీతూ మాస్టర్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టింది. అటు ఓటింగ్ లో కూడా మంచి స్థానంలోనే ఉంది. కానీ 11వ వారం అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అవ్వడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి నీతూ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత.. నటరాజ్ మాస్టర్ తన భార్యతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ బండారం ఆయన బయటపెట్టడంతో ఇదంతా నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రెస్ మీట్ లో భాగంగా వంశీ ప్రవర్తన పై నటరాజ్ మాస్టర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వాడు సినిమాల్లోనే రౌడీ కాదు.. హౌస్ లో కూడా రౌడీనే అంటూ నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యాడు.
also read:పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!
వంశీ గురించి నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ..” వాడు బయట రౌడీనే.. హౌస్ లో కూడా రౌడీనే. ఒక పెళ్ళైన లేడీ (నీతూ మాస్టర్)ను పట్టుకొని పులిహోర కలుపుతోంది.. మసాజ్లు చేస్తోంది అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. వినకూడని, వాడకూడని పదాలు మాట్లాడుతూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఇలాంటి పదాలతో ఈ షో ద్వారా జనాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు. అంటూ నటరాజ్ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాడు ఒక కంటెస్టెంటా? నీ అ*మ్మ అంటూ కూడా మాట్లాడుతున్నాడు. అసలు వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియని ఒక వ్యక్తికి హౌస్ లో కంటెస్టెంట్ గా అవకాశం కల్పించడం ఏంటి? అందులోనూ ఇంకా టాప్ ఫైవ్ అంటూ ప్రచారం చేయడం ఏంటి ? అంటూ బిగ్ బాస్ పై కూడా మండిపడ్డాడు.
అంతేకాదు హౌస్ మొత్తం అలయన్స్ లు పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారని, ఇన్ని సీజన్లో ఇలాంటి వరస్ట్ గేమ్ ను , టాక్సిక్ గేమ్ ని ఎప్పుడు చూడలేదు అంటూ నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు. అంతేకాదు ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ తరఫున సెలబ్రిటీలు స్టేజ్ పైకి వచ్చినప్పుడు ప్రముఖ సీనియర్ కమెడియన్ అలీ (Ali) వంశీకి సపోర్టు చేయడంతో అలీను కూడా తప్పుపట్టారు నటరాజ్ మాస్టర్ దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannath) వంశీ కోసమే ఆప్ డౌన్లోడ్ చేసుకొని మరి ప్రతిరోజు ఓటింగ్ వేస్తున్నాడు అంటూ చెప్పారు. ఇలాంటి వాడినా మీరు ఎంకరేజ్ చేసేది సార్ .. మీకు చెప్పేది ఒక్కటే దయచేసి మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు.. ఆప్లు వెంటనే డిలీట్ చేయండి అంటూ నటరాజ్ మాస్టర్ తెలిపారు. ప్రస్తుతం వంశీని టార్గెట్ గా చేసుకొని నటరాజ్ మాస్టర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.