BigTV English

India Pakistan War : యూట్యూబర్ జ్యోతి అరెస్ట్.. పాక్‌కు ఆర్మీ సీక్రెట్స్

India Pakistan War : యూట్యూబర్ జ్యోతి అరెస్ట్.. పాక్‌కు ఆర్మీ సీక్రెట్స్

India Pakistan War : మన లానే ఉంటారు. మన చుట్టూనే ఉంటారు. మనలో ఒకరిలా కలసిపోతారు. అస్సలు డౌట్ రాదు. ఏమాత్రం అనుమానించేలా ప్రవర్తించరు. సడెన్‌గా ఒకరోజు వారి గురించి బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుంది. అలా ఉంటుంది దొంగ వెధవలతో. ఆ వెధవల్లో కొందరు దేశ ద్రోహులు సైతం ఉంటారు. జనాలను మోసం చేసే వాళ్లు ఓ టైప్ అయితే.. ఏకంగా దేశాన్నే చీట్ చేసే కంత్రీ గాళ్లను అస్సలు వదిలిపెట్టొద్దు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత అలాంటి దేశద్రోహుల పని పడుతున్నారు పోలీసులు. లేటెస్ట్‌గా అలాంటి మూడు ఉదంతాలు బయటపడ్డాయి. ఇక్కడే పుట్టి.. ఇక్కడి గాలి పీల్చుతూ, ఇక్కడి తిండి తింటూ.. దేశానికే వెన్నుపోటు పెడిచిన ద్రోహులు వాళ్లు. బద్మాష్ గాళ్లు.


యూట్యూబర్ జ్యోతి అరెస్ట్

జ్యోతి మల్హోత్రా. హర్యానాలో ఫేమస్ యూట్యూబర్. ‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తోంది. దేశమంతా తిరుగుతూ ట్రావెల్ వీడియోలు పెడుతుంటుంది. లక్షల్లోనే ఉన్నారు ఆమె సబ్‌స్క్రైబర్స్. వీడియోలకు వ్యూస్ కూడా మిలియన్లలోనే ఉన్నాయి. ఆ మధ్య ఆమె ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్ వెళ్లారు. అక్కడి వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెట్టారు. వాటికి కూడా భారీగా వ్యూస్ వచ్చాయి. ఇంత వరకూ రొటీన్ న్యూస్. ఆ తర్వాతే అసలు మేటర్. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్ వెళ్లిన జ్యోతి అండ్ టీమ్.. అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా గూఢచర్యం చేసింది. అప్పటికే సేకరించిన భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు లీక్ చేసింది. అందుకు ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంది. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయన డైరెక్షన్‌లోనే ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నిత సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా సేకరించారని.. వాటిని పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులకు అందించారని తేల్చారు. జ్యోతితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు హర్యానా పోలీసులు. పాకిస్తాన్ వెళ్లి జ్యోతి షూట్ చేసిన ట్రావెల్ వీడియోలు సైతం ఆ దేశం తరఫున సానుకూల ప్రచారం చేయడానికేనని తేలడం మరింత షాకింగ్ మేటర్.


పాక్‌ కోసం స్పై చేసిన స్టూడెంట్

అదే హర్యానాలో పాకిస్తాన్‌ కోసం స్పై చేస్తు్న్న ఓ స్టూడెంట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పటియాలలోని ఖల్సా కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు దేవేంద్రసింగ్‌. పటియాలాలో ఇండియన్ ఆర్మీకి చెందిన కంటోన్మెంట్ ఉంది. దానికి సంబంధించిన వివిధ ఫోటోలు, అక్కడి ఆర్మీ అధికారుల వివరాలు సేకరించాడు. లాస్ట్ ఇయర్ నవంబర్‌లో పాకిస్తాన్ వెళ్లాడు. పాక్ ఐఎస్‌ఐ అధికారులను కలిశాడు. తాను సేకరించిన పటియాలా ఆర్మీ కంటోన్మెంట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి ఇచ్చాడు. అందుకుగానీ దేవేంద్రసింగ్‌కు భారీగా డబ్బులు ముట్టజెప్పింది పాక్. అయితే, ఇటీవల మే 12న ఫేస్‌బుక్‌లో పిస్టోల్ ఫోటోలు పెట్టాడు. అప్పటికే సోషల్ మీడియా పేజెస్‌పై ఫోకస్ పెట్టిన హర్యానా పోలీసులకు ఆ ఫోటోలు చూసి అతని మీద అనుమానం వచ్చింది. దేవేంద్రసింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఉత్తినే ఆ ఫోటోస్ పెట్టానంటూ బుకాయించాడు. మొబైల్ ఫోన్ పరిశీలించగా.. పాక్‌తో లింకులు బయటపడ్డాయి. వెంటనే దేవేంద్ర సింగ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో పాకిస్తాన్ అధికారులకు తాను మన దేశ సైనిక రహస్యాలు అందించానని ఒప్పేసుకున్నాడు. దేవంద్రసింగ్ ఫోన్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. దర్యాప్తు చేస్తున్నారు హర్యానా పోలీసులు.

హనీ ట్రాప్‌లో ఆర్డినెన్స్ ఉద్యోగి..

ఆమధ్య యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పని చేసే రవీంద్రకుమార్‌ను ఓ అమ్మాయితో హనీట్రాప్ చేశారు పాకిస్తాన్ అధికారులు. ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన సున్నిత సమాచారాన్ని తెలుసుకున్నారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ డీటైల్స్ కూడా పాక్ చేరాయని గుర్తించారు. ఆ యువతి మోజులో పడి.. ఐఎస్‌ఐ మెంబర్స్‌తో బాగా లూలూచీ పడ్డాడని తెలుసుకున్నారు. రవీంద్రకుమార్‌ను అరెస్ట్ చేశారు.

Also Read : 10 పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్‌లను పేల్చేసిన భారత జవాన్

ఎవర్రా మీరంతా..

ఇలా స్టూడెంట్, యూట్యూబర్, ఆర్మీ సోల్జర్.. ఎవరికి పడితే వారికి వల వేసి ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది పాపిష్టి పాకిస్తాన్. మన దేశ పౌరులకు ఇదేం పోయే కాలమో అర్థం కావట్లేదు. డబ్బులకు కక్కుర్తి పడి.. ఏకంగా దేశ ద్రోహానికి పాల్పడుతుండటం దారుణమైన విషయం. యూట్యూబ్ వీడియోలతో వచ్చే డబ్బులు సరిపోనట్టు.. పాకిస్తాన్‌ కోసం ఇండియాలో గూఢచర్యం చేసింది జ్యోతి. ఆ స్టూడెంట్ ఏమో మనీ కోసం ముష్కరులతో చేతులు కలిపాడు. ఆ ఆర్డినెన్స్ కంపెనీ ఉద్యోగేమో వలపు వలకు చిక్కి సొల్లు కార్చాడు. ఇలాంటి వెధవలను ఊరికే వదిలిపెట్టొద్దు. ఇంకొకరు అలా చేయాలంటేనే భయపడేలా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×