Road Accident: రోడ్ల మీద వెళ్లేటప్పుడు పదేపదే జాగ్రత్తలు చెబుతున్నా వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రమాదానికి గురైన ఓ ట్యాంకర్ నుంచి ఏకంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైంది. అంతేకాదు ఆ యాసిడ్ సమీప ప్రాంతాలను చుట్టేసింది. దీంతో కంగారు పడిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.
తమిళనాడు ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ జిల్లా తూత్తుకుడి నుండి కరూర్‌కు వెళ్తోంది ఓ ట్యాంకర్ లారీ. దాని నిండా సుమారు 25 వేల లీటర్ల హైడ్రో క్లోరిక్ యాసిడ్ తీసుకెళ్తోంది. ఆ ట్యాంకర్ ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దిండిగల్-కరూర్ జాతీయ రహదారిపై కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున కావడంతో ట్యాంకర్ డ్రైవర్ నిద్ర మత్తులో నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
అదే సమయంలో తూత్తుకుడి నుండి నామక్కల్ కు సున్నపురాయిని తీసుకెళ్తున్న మరో లారీ, యాసిడ్ ట్యాంకర్ ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాసిడ్ లారీ ట్యాంక్ వాల్వ్ పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదం సమయంలో లారీలోని దాదాపు 25 వేల లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రో క్లోరిక్ యాసిడ్, హైవేతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. తెల్లవారు జామున సమయంలో ఘటన జరగడంతో చాలామంది ఆ ప్రాంత ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.
ప్రమాదం గురించి తెలియగానే తడికొంబు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణం ట్రాఫిక్‌ను నియంత్రించారు. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ సిబ్బంది రంగంలోకి దిగి యాసిడ్ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. పొగ మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి నాలుగైదు గంటలు పట్టింది. నిరంతరాయంగా నీటిని రోడ్డుపై పిచికారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రమాద ప్రాంతంలోకి ఇతర వాహనాలను అనుమతించ లేదు అధికారులు.
రహదారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్ పొగను పీల్చినవారికి గొంతు బొంగురు పోవడం, కళ్లలో మంట, ఒంటిపై దురద వంటి సమస్యలు తలెత్తాయి. ఆ ప్రాంతంలో భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారు.
ஹைட்ரோ குளோரிக் ஆசிட் ஏற்றி வந்த லாரி விபத்து.. பின்னால் வந்த மற்றொரு லாரி மோதியதில் வால்வு உடைந்து வழிந்தோடிய ஹைட்ரோ குளோரிக் ஆசிட்.. புகைமூட்டமான சாலையால் பரபரப்பு.!#Dindigul | #HydrochloricAcid | #Accident | #PolimeNews pic.twitter.com/dCGhYkbIDJ
— Polimer News (@polimernews) November 15, 2026