E-Paper
Advertisement

భార‌తీయ‌ త‌ల్లిదండ్రుల పెంప‌క‌మే స‌రిగ్గా లేదు..అందుకే వీధి రౌడీల్లా రెచ్చిపోయారు

భార‌తీయ‌ త‌ల్లిదండ్రుల పెంప‌క‌మే స‌రిగ్గా లేదు..అందుకే వీధి రౌడీల్లా రెచ్చిపోయారు
Advertisement

Mohammed Yousuf On Team India Behaviour:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament) విజేతగా టీమిండియా ( Indian Team) నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసి తొమ్మిదో సారి ట్రోఫీ అందుకుంది. అయితే ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు చేసిన సెలబ్రేషన్స్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ (Mohammed Yousuf ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతీయ తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేదని… అందుకే అండర్ 19 కుర్రాళ్ళు వీధి రౌడీల్లా రెచ్చిపోయారని ఆగ్రహించాడు.

భార‌తీయ‌ త‌ల్లిదండ్రుల పెంప‌క‌మే స‌రిగ్గా లేదు..అందుకే వీధి రౌడీల్లా రెచ్చిపోయారు

క్రికెట్ అన్నాక గెలుపోటములు సహజమేనని.. గెలిచిన మాత్రాన ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరమా? అంటూ ఆగ్రహించాడు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఎంత క్రమ శిక్షణతో ఉండాలో తెలుసుకోవాలని టీమిండియా క్రికెటర్లకు చురకలు అంటించాడు. వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోవడంతోనే మైదానంలో చిల్లరగా బిహేవ్ చేశారని మండిపడ్డాడు. గెలిచినా, ఓడినా ప్రతిసారి ప్రత్యర్థులను గౌరవించాలని అదే మంచి సంస్కృతి అని వివరించాడు. వదిలితే, పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను చంపేసేవాళ్ల‌ని హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో మహ్మద్ యూసఫ్ చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

టీమిండియా అండర్ 19 క్రికెటర్ల పై ఐసీసీ బ్యాన్ విధించాలి

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఛాంపియన్ గా నిలిచిన యువ భారత క్రికెటర్లు ఓవరాక్షన్ చేశారంటూ తన్వీర్ అహ్మ‌ద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి క్రికెటర్లపై ఐసీసీ బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. మ్యాచ్ గెలిచిన తర్వాత హంజా జహూర్ పైన రౌడీయిజం చేసే ప్రయత్నం చేసినట్టు సీరియస్ అయ్యాడు. పాకిస్తాన్ క్రికెటర్లను కావాలనే రెచ్చగొట్టి గొడవ పెట్టుకున్నారని ఆగ్రహించాడు. డ్రెస్సింగ్ రూమ్ దగ్గర దాకా వెళ్లి పాకిస్తాన్ ప్లేయర్లను కించపరుస్తూ టీమ్ ఇండియా క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఫైర్ అయ్యాడు.

Advertisement

ఈ నేపథ్యంలో ఈ ఫైనల్ మ్యాచ్ పై క‌చ్చితంగా విచారణ చేయాలని తన్వీర్ అహ్మ‌ద్ డిమాండ్ చేశారు. గొడవకు దిగిన వాళ్లపై ఐసీసీ బ్యాన్ విధించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉండగా అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 337 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన టీమిండియా… 50 ఓవర్లు ఆడి తొమ్మిది వికెట్ల నష్టానికి విక్టరీ అందుకుంది. దీంతో ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన టీమిండియా తొమ్మిదవ సారి ఛాంపియన్ గా నిలిచింది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

ఇంత దుర్మార్గమా? ఆసియా క‌ప్ ఇవ్వ‌కుండా న‌ఖ్వీని జై షానే అడ్డుకున్నాడు

భార‌త క్రికెట‌ర్ల‌ మెద‌ళ్ల‌లో విషం నిప్పులుతున్నారు..అందుకే మృగాళ్ల‌లాగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు

అండర్ 19 ఆసియా కప్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ ఎందుకు ఇవ్వలేదంటే?

హంజాపై టీమిండియా ప్లేయర్ దాడి? స్టేడియం నుంచి పారిపోయిన పాక్ ఆటగాళ్లు

పాక్ పై టీమిండియా ‘దండ్రయాత్ర’..9వ సారి ఆసియా కప్ మనదే

“అబ్ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్” పేరుతో పాకిస్తాన్ దొంగాట‌..ప‌గ‌ల‌బడి నవ్విన‌ ఆర్య‌వీర్ సెహ్వాగ్

బాబ‌ర్ ఆజం బ్యాటింగ్ చేస్తుండ‌గా…క‌ట్ డ్రాయ‌ర్లు, బ‌నియ‌న్ల‌, నైటీల విజువ‌ల్స్‌

Big Stories

Advertisement
×