E-Paper
Advertisement

తమిళనాడు బాలికల లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. యజమాని ఇంట్లో సోదాలు!

తమిళనాడు బాలికల లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. యజమాని ఇంట్లో సోదాలు!
Advertisement

Tamil Nadu: తమిళనాడులో బాలికలపై లైంగిక దాడి కేసు సంచలనం సృష్టిస్తుంది. జెమ్ గ్రానైట్స్ సంస్థ యజమాని ఆర్. వీరమణి నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై రాయపేటలోని లాయిడ్స్ రోడ్డులో ఉన్న వీరమణి ఇంటికి 10 మందికి పైగా సిట్ పోలీసులు చేరుకున్నారు. ఇంటి లోపల గదులతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

వీరమణి ఇంటి తోటలో..

ప్రత్యేకంగా ఇంటి ఆవరణలో ఉన్న తోట ప్రాంతంపై పోలీసుల దృష్టి పెట్టారు. వీరమణి ఇంటి తోటలో బాలిక మృతదేహాన్ని పాతిపెట్టి ఉండవచ్చంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ సమాచారం ఆధారంగా తోటలో అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాలికకు సంబంధించిన ఆనవాళ్లు, ఇతర కీలక ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ చేస్తున్నారు. ఇప్పటికే బాలికలపై లైంగిక దాడి ఆరోపణల కేసులో వీరమణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిజంగానే పాతిపెట్టారా..

Advertisement

ప్రస్తుతం జైలులో ఉన్న వీరమణికి సంబంధించిన కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన సిట్.. తోటలో లభించే ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉన్నట్టు అక్కడి అధికారులు అనుకుంటున్నారు. బాలికను నిజంగానే అక్కడ పాతిపెట్టారా.. పోలీసుల తనిఖీల్లో ఏవైనా అవశేషాలు బయటపడతాయా అన్న ఉత్కంఠ అక్కడ రేపుతుంది. దీంతో సోదాల అనంతరం పోలీసుల అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకోంది.

Also Read: ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు.. అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం

Tags

Related News

విడాకుల కోసం భారీగా డబ్బు డిమాండ్ చేసిన భార్య.. ఇచ్చాక మాట తప్పిందని కోర్టుకెక్కిన భర్త

అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన బస్సు, 23 మందికి పైగా మృతి!

మద్యం మత్తులో వేధింపులు.. కత్తితో పొడిచి పొడిచి భర్తను చంపిన భార్య

200 కి.మీ. వేగం.. ఊడిపడిన ఇంజిన్.. ద్వారకా టన్నెల్‌లో భయానక ప్రమాదం!

పైకి నవ్వులు.. లోపల కత్తులు.. యోగి, అమిత్ షా మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా..?

భార్య ఏడ్చినంత మాత్రాన భర్త వేధించనట్లేనా? ఆత్మహత్య, 498A కేసులో కోర్టు కీలక తీర్పు

రసగుల్లా అని నమ్మించి.. నాటు బాంబు ఇచ్చారు.. నోట్లో వేసుకోగానే పేలి వ్యక్తి మృతి!

Big Stories

Advertisement
×