Dear Astronaut Vs Aakasam lo oka Taara : సినిమా ఇండస్ట్రీలో కథ కాఫీ వివాదం జరగడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక సినిమా అచ్చం మరో సినిమా కథను పోలి ఉండడంతో గతంలో ఇలాంటి వివాదాలు ఎన్నో తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి కాపీ వివాదం తెరపైకి వచ్చింది. ఓకే కథతో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అది కూడా ఓకే రోజు విడుదల కావడం గమనార్హం. మరి ఒకే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ రెండు సినిమాలు ఏంటి అసలు ఈ వివాదం వెనుక ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara) సినిమా నవంబర్ 20 తేది విడుదల కాబోతోంది. అదేవిధంగా కార్తీక్ భాగ్యరాజ్ దర్శకత్వంలో సౌమిత్ రావు నటించిన డియర్ ఆస్ట్రోనాట్(Dear Astronaut) సినిమా కూడా నవంబర్ 21 తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే కథతో విడుదల కాబోతున్నాయి. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ కార్తీక్ భాగ్యరాజ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టారని సమాచారం.
కార్తీక్ భాగ్యరాజ్ 2021లోనే ఈ కథతో ‘కౌగిలి’ అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించి యూట్యూబ్లో అప్లోడ్ చేయగా చాలా మంచి ఆదరణ లభించింది.దీంతో ఆ ‘కౌగిలి’ షార్ట్ ఫిల్మ్ డిలీట్ చేసి ఆ కథను మరింత రూపొందించి డియర్ ఆస్ట్రో నాట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అయితే ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్లో ఉండగానే మరొక దర్శకుడు ఇదే కథతో సినిమా చేయబోతున్నారని కార్తీక్ భాగ్యరాజ్ తెలిపారు. ఇలా ఆకాశంలో ఒక తార పేరుతో సినిమా చేస్తున్నట్టు తెలియగానే ఆదర్శకుడికి కార్తీక్ సుబ్బరాజు ఫోన్ చేసినట్టు సమాచారం. ఆ సమయంలో ఆకాశంలో ఒక తార దర్శకుడు నుంచి ఒకే ఐడియా ఇద్దరికీ రాకూడదా? మీ కథేంటో మాకు తెలియదు. మా కథతో మేము ముందుకెళ్తున్నాం అంటూ సమాధానం వచ్చినట్టు సమాచారం.
ఆకాశంలో ఒక తార సినిమా వెనుక బడా నిర్మాణ సంస్థలు బడా ప్రొడ్యూసర్లు ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ లో కూడా కేసు వేయలేకపోయామని కార్తీక్ భాగ్యరాజు వర్గాల నుంచి వార్తలు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పెద్ద వాళ్ళకి వ్యతిరేకంగా నువు గెలిచేది ఏమి ఉండదులే .. నీ సినిమా ముందు విడుదల చేసి నువు ప్రూవ్ చేసుకో అంటూ సమాధానం వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఒకే కథతో ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో తెలియాల్సి ఉంది.
Also Read: పవన్ తేజ్ కొణిదెల హీరోగా ‘జనతా’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్!