BigTV English

Indians In Canada: కెనడాలో ఉద్యోగాల కోసం భారత యువత బారులు.. ఇండియానే బెటర్ బ్రో!

Indians In Canada: కెనడాలో ఉద్యోగాల కోసం భారత యువత బారులు.. ఇండియానే బెటర్ బ్రో!

Indians In Canada: కెనడాలో చాలా జాబులున్నాయి.. చాలా డబ్బులున్నాయి.. అక్కడికి వెళితే చాలు.. లైఫ్ సెటిల్ అయిపోతుంది. కొన్నేళ్లలోనే ధనవంతులమైపోవచ్చని అనుకునే.. ఇండియన్స్ కోసమే ఈ న్యూస్. ఈ స్టోరీ చూశాక.. కెనడాపై మీ ఒపీనియన్ మారుతుంది. ఆటోమేటిక్‌గా ఇండియాపై రెస్పెక్ట్ పెరుగుతుంది. మొత్తంగా.. విదేశాల్లో భారతీయుల లైఫ్‌పై మీకు క్లియర్ పిక్చర్ క్లారిటీ వస్తుంది.


భారత్‌లోనే ఉండి మంచి ఉద్యోగం చూసుకోవడం బెటరా? విషయంలోకి వెళ్లే ముందు.. ఈ వీడియో చూడండి. ఇండియా నుంచి కెనడా వెళ్లిన ఓ అమ్మాయి ఏం చెబుతుందో బాగా వినండి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==


చూశారుగా.. ఓ చిన్న స్థాయి ఉద్యోగాల కోసం.. కెనడాలో ఎంత మంది బారులు తీరారో. తక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగాల కోసం.. ఎంత మంది క్యూ కట్టారో చూస్తున్నారుగా. పైగా.. ఇప్పటికే కెనడాలో ఉంటున్న భారతీయులు కూడా.. మన ఇండియానే బెటర్ అని చెబుతుండటమే.. ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే.. విదేశాల్లో లైఫ్ మనం ఊహించుకున్నంత లగ్జరీగా ఉండదు. ఒక్కోసారి.. ఉద్యోగాల కోసం ఇలా రోడ్ల మీద గంటలకొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అయినా.. జాబ్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు.

నిజానికి.. భారతీయులకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలంటే చాలా మోజు ఉంటుంది. అక్కడే చదువుకోవాలి. అక్కడే జాబ్ వెతుక్కోవాలి. అక్కడే స్థిరపడాలి అనే ఆలోచనలుంటాయి. చాలా మందికి.. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో సెటిలవడం పెద్ద డ్రీమ్. కానీ.. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే.. విదేశాల్లో మనోళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. మనోళ్ల సంగతి పక్కనబెడితే.. ఆ దేశాల పౌరుల పరిస్థితేంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. కెనడాలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానికి.. ఈ అమ్మాయి వీడియోనే బిగ్ ఎగ్జాంపుల్. అందుకే.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి.. కెనడా లాంటి దేశాల్లో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఇంటి అద్దెలు, ఆహారం, రవాణా, మెడికల్ కేర్ లాంటివి.. ఇండియాతో పోలిస్తే చాలా ఖరీదైనవి. మంచి జీతం ఉన్నా.. ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయ్. కెనడాలో ఉద్యోగాలున్నా.. వాటిని పొందడం అంత సులభం కాదు. కొన్ని రంగాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అర్హతకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోవచ్చు. వచ్చిన ఉద్యోగంలోనూ చాలా తక్కువ జీతం ఉండొచ్చు. అందువల్ల.. విదేశాల కంటే.. భారత్‌లోనే ఉండటం బెటరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: జూలైలో అంగరంగ వైభవంగా తానా మహాసభలు.. ఎక్కడో తెలుసా

ఇక్కడే.. మంచి ఉద్యోగం చూసుకొని.. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. అవసరమైనప్పుడు.. ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుంది. పైగా.. విదేశాలతో పోలిస్తే.. మన దేశంలో జీవన వ్యయం తక్కువ. మనం పెరిగిన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించొచ్చు. పైగా.. భారత ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయ్. సరైన స్కిల్స్ ఉంటే.. ఇక్కడే మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు.

 

Related News

Lord Ram Idol In Canada: నిలువెత్తు శ్రీ రాముడి విగ్రహం.. కెనడాలో అట్టహాసంగా ఆవిష్కరణ!

NATS Event: ఘనంగా ముగిసిన  నాట్స్ 8 వ తెలుగు సంబరాలు..

America: విషాదంగా విహారయాత్ర.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Rajendra Prasad : పీవీ నరసింహారావు పై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. మళ్లీ మాట తూలారా..?

Satish meka tana trustee: విశాఖ నుంచి అమెరికా వరకు.. తానా అధ్యక్షుడిగా సతీష్ మేకా!

Big Stories

×