TANA Conference 2025: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) జూలై 3 నుంచి 5వ తేదీ వరకు తానా కాన్ఫెరెన్స్ నిర్వహిస్తోంది. డిట్రాయిట్‌లో జరిగే ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది తెలుగువాళ్ళు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా తరలిరానున్నారు. డెట్రాయిట్ మెట్రో ఏరియాలో డెట్రాయిట్ తెలుగు సంఘం (DTA), శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీ షిరిడి సాయి సంస్థాన్, ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా వంటి సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ మహాసభల్లో టాలీవుడ్ నటీనటులు కూడా సందడి చేయనున్నారు. రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ తో పాటు హీరో నిఖిల్, హీరోయిన్ సమంత, ఐశ్వర్య రాజేశ్, యాంకర్ సుమ, దర్శకులు కె. రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను తదితరలు పాల్గొంటారు. ఈ సభల్లో యువతకు సంబంధించిన ప్రత్యక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ షో కూడా నిర్వహించనున్నారు.
Also Read: చైనాలో మరో 22 వైరస్‌లు.. పిచ్చిలేసి మొత్తం పోతారు..!