Side Effects of late Sleep: ఈ రోజుల్లో ఎవ్వరి చేతుల్లో చూసిన స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఒక్కో ఇంట్లో మూడు, నాలుగు ఉంటున్నాయి. వాళ్లు చూడటం చాలకా పిల్లలకు కూడా ఇస్తుంటారు. అర్థరాత్రి వరకు మేల్కొని మరి ఫోన్ చూస్తున్నారు. ఎప్పడూ ఒకటి లేదా రెండు గంటలకు నిద్ర పోతున్నారు ప్రస్తుతం ప్రజలు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల ఆరోగ్యం, మానసిక స్థితి, రోజువారీ జీవనంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
నిద్రకు భంగం:
స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. మెలటోనిన్ అనేది నిద్రను నియంత్రించే హార్మోన్. దీని వల్ల నిద్రపట్టడం ఆలస్యమవుతుంది లేదా నిద్ర నాణ్యత తగ్గుతుంది. అయితే రాత్రి ఎక్కువ సమయం ఫోన్ చూడటం వల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది, దీనివల్ల అలసట, నీరసం, రోజంతా నిస్తేజంగా ఉండటం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
కంటి సమస్యలు:
ఎక్కువ సమయం స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల కళ్లలో మంట, పొడిబారడం, మసకబారడం, తలనొప్పి వంటివి కలుగుతాయి.
రాత్రిపూట తక్కువ వెలుతురులో ఫోన్ చూడటం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది, ముఖ్యంగా ఈ సమస్య పిల్లలు, యువతపై ఎక్కువ పడుతుంది.
ఫోన్ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడటం వల్ల కనురెప్పలు రెప్పారించే తీరు తగ్గుతుంది, దీనివల్ల కళ్లు పొడిబారడం జరుగుతుంది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం:
సోషల్ మీడియా, న్యూస్ ఫీడ్స్, గేమ్‌లు రాత్రిపూట ఎక్కువగా చూడటం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. FOMO (Fear of Missing Out) కారణంగా ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుంది. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో తమను తాము పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గి, డిప్రెషన్‌కు దారితీస్తుంది. నిరంతరం సమాచారం గ్రహించడం వల్ల మెదడు అలసిపోతుంది, దీనివల్ల రోజువారీ పనుల్లో ఏకాగ్రత తగ్గుతుందని పలు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శారీరక ఆరోగ్యంపై ప్రభావం:
ఫోన్‌ను తలవంచి చూడటం వల్ల “టెక్ నెక్” అనే సమస్య తలెత్తుతుంది, ఇది మెడ మరియు వీపు నొప్పికి కారణమవుతుంది.
రాత్రిపూట ఫోన్ ఉపయోగించడం వల్ల నిద్ర తగ్గడం, జీవక్రియ మందగించడం జరుగుతుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. నిద్రలేమి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది, దీనివల్ల తరచూ అనారోగ్యం పాలవుతారు.
ఉత్పాదకత తగ్గడం:
రాత్రిపూట ఫోన్ ఉపయోగించడం వల్ల నిద్ర తగ్గడం, రోజువారీ పనుల్లో ఏకాగ్రత మరియు ఉత్పాదకత తగ్గుతాయి. ఉదయం లేవడం ఆలస్యమవడం, రోజంతా అలసటగా ఉండటం వల్ల పని నాణ్యత దెబ్బతింటుంది.
సామాజిక మరియు కుటుంబ సంబంధాలపై ప్రభావం:
రాత్రిపూట ఫోన్‌లో గడపడం వల్ల కుటుంబ సభ్యులు లేదా భాగస్వామితో గడిపే సమయం తగ్గుతుంది, దీనివల్ల సంబంధాలు దెబ్బతింటాయి. సామాజిక ఒంటరితనం (Social Isolation) పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఆన్‌లైన్ ప్రపంచంలో ఎక్కువ సమయం గడపడం వల్ల వాస్తవ ప్రపంచంలో సంబంధాలు తగ్గుతాయి.
Also Read: బంగ్లాదేశ్ బలుపు.. హిందూ టెంపుల్ కూల్చివేత..
నివారణ చర్యలు:
రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత ఫోన్ వాడకాన్ని పూర్తిగా నివారించండి. ఫోన్‌లో బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్ ఆన్ చేయండి. రోజువారీ స్క్రీన్ టైమ్ పరిమితి సెట్ చేసుకోండి. పుస్తకం చదవడం, ధ్యానం, లేదా సంగీతం వినడం వంటి శాంతియుత కార్యకలాపాలను అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం మంచిది.