AP : కొన్ని ఘటనలు వెరైటీగా ఉంటాయి. జనాల సైకాలజీకి అద్దం పడుతుంటాయి. లిక్కర్ లారీ పల్టీలు.. చేపల బండి బోల్తా.. లాంటి సంఘటనలు జరిగినప్పుడు చూడాలి హంగామా. స్థానికులంతా ఎగబడుతుంటారు. దొరికిన కాడికి దోచుకెళుతుంటారు. మందు బాటిళ్ల కోసమైతే కొట్టుకుంటారు కూడా. అదే చేపలైతే అంత కలిసి పంచుకుంటారు. ఇలాంటిదే లేటెస్ట్‌గా మరో న్యూస్. అయితే ఈసారి చేపలు, బాటిళ్లు లాంటివి కావు. బోల్తా పడింది గోల్డ్ వ్యాన్. భారీగా బంగారం తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఆగిపోయింది. నెక్ట్స్ ఏం జరిగిందంటే..
జోయాలుక్కాస్. ఫేమస్ గోల్డ్ షాప్. కిలోల కొద్దీ బంగారం ట్రాన్జాక్షన్స్ చేస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచీలు ఉన్నాయి. లేటెస్ట్‌గా విజయవాడ నుంచి చెన్నై బ్రాంచ్‌కు రూ.8 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను మినీ వ్యాన్‌లో తరలిస్తున్నారు. సెక్యూరిటీ కోసం వాహనంలో ఓ గన్‌మెన్ కూడా ఉన్నాడు. అలా వెళ్తున్న గోల్డ్ వ్యాన్‌కు.. ఒంగోలు దగ్గరికి రాగానే యాక్టిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీ కొట్టింది.
వ్యాన్‌లో గోల్డ్ ఏమైందంటే..
అసలే బంగారం తరలిస్తున్న వాహనం. రూ.8 కోట్లకు పైగా విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్. అలాంటి వ్యాన్‌కు ప్రమాదం జరగడం.. రోడ్డు మీదే వెహికిల్ నిలిచిపోవడంతో టెన్షన్ మొదలైంది. ఆ యాక్సిడెంట్‌లో డ్రైవర్‌తో పాటు గన్‌మెన్‌కు కూడా గాయాలయ్యాయి. ఆ వ్యాన్‌ను చూడగానే తెలిసిపోతుంది అది విలువైన సరుకు తరలించే బండి అని. స్థానికులు ఆసక్తిగా అక్కడ గుమ్మి కూడారు. లోపల ఏముందా? అని గుచ్చి గుచ్చి చూస్తున్నారు. దొరికితే దోచేసుకునే వాళ్లే. కానీ, లోపల ఏముందో బయటకు కనిపించలేదు. వ్యాన్ పకడ్బందీగా ఉంది. ప్రమాదంలో ముందు భాగం డ్యామేజ్ అయినా.. వెనుక ఉన్న ట్రంక్ సేఫ్‌గానే ఉంది. అందులో ఉన్న గోల్డ్ సైతం సేఫే.
Also Read : పెళ్లి కూతురుపై రేప్ అటెంప్ట్.. పల్నాడులో దారుణం.. వీడియో రికార్డ్ చేస్తుండగా..
పోలీసులు అలర్ట్..
బంగారం తరలిస్తున్న వాహనం బోల్తా పడిందని విషయం పోలీసులకు తెలిసింది. ఖాకీలు కంగారు పడ్డారు. మనోళ్ల గురించి తెలిసిందేగా. లోపల గోల్డ్ ఉందని తెలిస్తే.. జనం ఎలా ఎగబడతారో ఊహించి అలర్ట్ అయ్యారు. ఎందుకైనా మంచిదని ప్రమాదానికి గురైన ఆ వాహనాన్ని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్‌లోనూ గోల్డ్ వ్యాన్‌కు సెక్యూరిటీ కల్పించారు. కానిస్టేబుల్స్‌ను కాపలాగా పెట్టారు. వ్యాన్‌లో ఉన్న బంగారానికి సంబంధించిన పత్రాలను పోలీసులు, జీఎస్టీ అధికారులు పరిశీలించారు. గోల్డ్ సేఫ్టీ ట్రంక్ ఓపెన్ చేయాలంటే.. బార్ కోడ్ డీటైల్స్ కావాలట.