BigTV English

OTT Movie : అనుకున్నదొక్కటి, అయ్యిందొకటి… ఇదెక్కడి లవ్ స్టోరీరా బాబూ

OTT Movie : అనుకున్నదొక్కటి, అయ్యిందొకటి… ఇదెక్కడి లవ్ స్టోరీరా బాబూ

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు, ఓటిటిలోకి వస్తూనే ఉన్నాయి. వీటి మధ్య ఎక్కువ సమయం గ్యాప్ కూడా ఉండకపోవడంతో, ఎక్కువగా ఉంది ప్రేక్షకులు ఓటీటీలోనే  సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ, థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకొని ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. చిన్ననాటి స్నేహితులైన ఒక అమ్మాయి అబ్బాయి చెట్టు ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. స్నేహం, ప్రేమ అనే రెండు అంశాలను ఇందులో చక్కగా ప్రజెంట్ చేశారు దర్శకుడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

కార్తీక్,మోనికా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వీళ్ళిద్దరూ ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. చదువు ముగిశాక ఒక చిన్న బిజినెస్ లోకి దిగుతారు. వివాహ ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని కలిసి నడుపుతారు. వీళ్ళ స్నేహం సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అవుతుంది. ప్రతీ చిన్న విషయాన్ని చర్చించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కొంతమంది వీళ్ళ స్నేహాన్ని చూసి ఈర్ష్య పడుతుంటారు. మరికొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వీరి స్నేహం ప్రేమగా మారి, చివరకు వివాహంతో ముగుస్తుందని ఊహిస్తారు. అయితే కార్తీక్, మోని తాము కేవలం స్నేహితులేనని, ప్రేమ గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేస్తారు.


వీళ్ళిద్దరూ ఇలా జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. ఇక్కడే స్టోరీ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒక కొత్త అమ్మాయి రావడంతో, వీళ్ళ స్నేహానికి ఆటకం ఎదురౌతుంది. ఈ కొత్త పాత్ర వీళ్ళ బంధాన్ని పరీక్షిస్తుంది. వీళ్ళు స్నేహితులుగానే ఉండాలా, లేక మరో బంధాన్ని కొనసాగించాలా అనే సందేహంలో పడిపోతారు. సమాజంలో కూడా వీళ్లపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. చివరికి కార్తీక్, మోనికా స్నేహితులుగానే ఉంటారా ? ప్రేమ పేరుతో యు టర్న్ తీసుకుంటారా ? కొత్తగా వచ్చిన అమ్మాయితో ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : సైకోగా మారి కత్తి పట్టిన కవి … 41 అవార్డులతో హోరెత్తిన సినిమా … ఏ ఓటీటీలో ఉందో తెలుసా

 

రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్

ఈ తమిళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘2కే లవ్ స్టోరీ’ (2K Love Story). 2025 లో వచ్చిన ఈ మూవీకి సుసీందిరన్ దర్శకత్వం వహించారు. ఇందులో జగవీర్, మీనాక్షి గోవిందరాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాల సరవణన్, జయప్రకాష్, ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కార్తీక్ (జగవీర్), మోనికా (మీనాక్షి గోవిందరాజన్) అనే బాల్య స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. 2025 మార్చి 14 నుంచి ఆహా (Aha). అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×