Brahmamudi serial today Episode: నీ రూంలో నీకు తెలియకుండా ఈ ఫోటో ఎవరు పెట్టారు. అంటూ నిలదీస్తుంది. దీంతో ఆ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారో నాకు తెలియదు అని రుద్రాణి చెప్తుంది. ఈ ఫోటో పెట్టలేదు అంటే మరే ఫోటో పెట్టావు అంటూ అడుగుతుంది. అసలు ఏ ఫోటో నేను పెట్టలేదు అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది. ఓసి నా అత్తా నా చెల్లెలినే ఇరికిద్దామనుకున్నావు.. చివరికి రాజ్ దగ్గర నువ్వే ఇరుక్కుపోయావు అని మనసులో అనుకుంటుంది. చిరాకుగా కిందకు వెళ్లిన రాజ్‌ను ఇంద్రాదేవి, అపర్ణ రెస్ట్ తీసుకున్నావా..? అని అడుగుతారు. రాజ్ ఇరిటేటింగ్‌గా… రెస్ట్ తీసుకునే విధంగా ఆంటీ రూం లేదు అంటాడు. ఇంతలో అపర్ణ అసలు నువ్వు కళావతి విషయంలో సీరిసయ్‌గా ఉన్నావా..? అని అడుగుతుంది. అదేంటమ్మా అలా అడిగావు.. తనను ఇంప్రెస్ చేయడానికి వంట రాకపోయినా వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇలా ఎందుకు కష్టపడతాను అంటూ రాజ్ చెప్పగానే.. ఇంద్రాదేవి వెటకారంగా కష్టపడి పాలు పితికి అమ్మితే ఆస్తులు వస్తాయి కానీ అమ్మాయి రాదమ్మా..? అంటుంది.
మరి ఏం చేయమంటారు అని రాజ్ అడుగుతాడు. ఇంప్రెస్ చేయమని చెప్తున్నాను కదా అంటుంది అపర్ణ. ఫస్ట్ స్టెప్పే ఫెయిల్ అయింది. ఇక నేనేం చేయాలి అంటాడు రాజ్. దీంతో ఇంద్రాదేవి ఓరేయ్ ఫెయిల్ అయిందని మూలన కూర్చుంటే ఎలా మేము ఉన్నాము కదా..? నీ వెనక అంటూ రాజ్ కు కొన్ని సూచనలు చెప్పి గిఫ్టులు తీసుకుని కావ్య దగ్గరకు వెళ్లేలా చేస్తారు ఇద్దరు. రాజ్ కావ్య దగ్గరకు వెళ్లగానే అపర్ణ అనుమానంగా అత్తయ్యా లోపలికి వెళ్లగానే ఏం తేడా కొట్టదు కదా అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి పిచ్చిదానా అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను విను అంటూ మొదట నా మనవడు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. కావ్య రాజ్‌ను చూడగానే.. మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అని చెప్తుండగానే.. పైన కావ్య రాజ్‌ను గదిలోకి ఎందుకు వచ్చారు.. అని అడుగుతుంది.
దీంతో రాజ్ మీ కోసమే అని చెప్తాడు. ఇంట్లో అందర ఉండగా అలా గదిలోకి వచ్చేస్తారా..? అంటుంది కావ్య. రాజ్ కంగారుగా నేను రావడం ఎవరూ చూడలేదు అంటాడు. అయినా సరే మీరు ఇలా రావడం నాకు నచ్చడం లేదు అని చెప్తుంది. దీంతో మీకు ఇష్టం లేదు కాబట్టి రాకూడదు అనుకున్నాను కానీ రాకుండా ఉండలేకపోయాను.. అంటుంటే.. అసలు గదిలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. మీకు గిఫ్టు ఇద్దామని వచ్చాను అంటూ ఇదిగోండి బొకే అంటూ ఇవ్వగానే.. కింద ఇంద్రాదేవి ఆ తర్వాత డ్రెస్ ఇస్తాడు. ఆ డ్రెస్ తీసుకుని ఈ డ్రెస్ నాకా అంటుంది. మీకే అని రాజ్ చెప్తాడు. డ్రెస్ చూసి ఎంత బాగుందో అంటుంది. అప్పుడు నా మనవుడు నా కోసం ఒకసారి వేసుకుంటారా..? అని అడుగుతాడు.
కావ్య డ్రెస్ వేసుకుని వస్తుంది. ఆ డ్రెస్‌లో కావ్యను చూసి రాజ్ షాక్ అవుతాడు.. కావ్యను అలాగే చూస్తుండిపోతాడు. ఇంతలో ఇంద్రాదేవి ఎగిరి గంతేస్తుంది అపర్ణ కంగారుగా అత్తయ్యా ఏంటి ఏమైంది అంటూ గట్టిగా అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి అపర్ణ నా మనవడు మనవరాలు ఏడి ఎక్కడ వాళ్లు కలిసిపోయారు కదా అంటుంది. దీంతో అపర్ణ వాళ్లు కలవలేదు.. మీరు కలవరిస్తున్నారు అంతే అంటుంది. దీంతో ఇంద్రాదేవి ఇదంతా నా కలా నిజం కాదా..? అంటుంది. ఇంతలో రాజ్ డల్లుగా కిందకు వస్తాడు. రాజ్ రాగానే ఏరా మనవడా ప్లాన్ సక్సెస్ అయిందా.. నా మనవరాలు ఇంప్రెస్ అయిందా అని అడుగుతారు. ఇంప్రెసా… ఆవిడా అంటూ రాజ్ పైన జరిగింది చెప్తాడు. కావ్య కోపంగా రాజ్‌ను తిట్టిన విషయం చెప్తాడు. దీంతో ఇంద్రాదేవి మరో ప్లాన్ వేద్దామని చెప్తుంది.
రూంలో ఉన్న రుద్రాణి ఫోటో ఎవరు మార్చారు అని ఆలోచిస్తుంటే యామిని ఫోన్ చేసి హలో రుద్రాణి గారు ఫోటో చూపించారా..? రాజ్ చూసి షాక్ అయ్యాడా..? అని అడుగుతుంది. అవును చూసి షాక్ అవ్వడమే కాదు థ్రిల్ అయిపోయాడు అని చెప్తుంది రుద్రాణి. అవునా ఈ పాటికి గొడవ పెట్టుకుని ఉండాలే… నన్నే మోసం చేస్తావా అంటూ బాగా తిట్టి ఉండాలి కదా అంటుంది యామిని. అవును తిట్టాడు.. బాగా తిట్టాడు.. కానీ కావ్యను కాదు నన్ను అని చెప్పగానే యామిని షాక్ అవుతుంది. మిమ్మల్ని ఎందుకు తిడతాడు అని అడగ్గానే.. నేను నా రూంలో కావ్య ఫోటో పెడితే ఎవరో మార్చేసి మా స్వప్న ఫోటో పెట్టారు అని చెప్తుంది. దీంతో ఇక లాభం లేదు మీరు డైరెక్టుగా వెళ్లి రాజ్ ముందు ఆ ఇంట్లో కావ్యకు అత్తయ్య ఉన్నాడు.. మామయ్య ఉన్నాడు కానీ అత్తయ్య కొడుకు ఎక్కడున్నాడు అనే పాయింట్ రేజ్ చేయ్ అని చెప్తుంది. సరేనని రుద్రాణి వెళ్తుంది. మరోవైపు రాజ్‌ను హర్ట్ చేసి పంపిస్తావా..? అంటూ అపర్ణ, ఇద్రాదేవి వెళ్లి కావ్యను తిడుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?