OTT Movie : బెంగాలీ ఇండస్ట్రి నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు స్టోరీ అంటే ఇలా ఉండాలి, అనుకునే విధంగా ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 2011లో అత్యధిక వసూళ్లు సాధించిన బెంగాలీ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇది 41 అవార్డులను గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
కోల్‌కతా నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు నగరంలోని అట్టడుగు వర్గాల ప్రజలపై జరుగుతాయి. ప్రతి హత్య తర్వాత, కిల్లర్ ఒక బెంగాలీ కవితను బాధితుడి వద్ద వదిలి వెళుతుంటాడు. ఈ కవితలు సుకుమార్ రే, జీవనానంద దాస్, బినోయ్ మజుందార్, శక్తి చటోపాధ్యాయ వంటి ప్రముఖ బెంగాలీకి చెందిన కవులవికి చెందినవి. ఈ హత్యలను అరికట్టడానికి, సస్పెండ్ అయిన మాజీ పోలీసు అధికారి ప్రబీర్ రాయ్ సహాయాన్ని పోలీసు డిపార్ట్‌మెంట్ తీసుకుంటుంది. ప్రబీర్ ఒక కోపిష్టి స్వభావం గల అధికారి. అతని గతంలోని కొన్ని సంఘటనల కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇప్పుడు అతనితో పాటు, డిటెక్టివ్ అభిజిత్ పక్రాషి కూడా ఈ కేసును ఛేదించడంలో సహాయపడతాడు.
అభిజిత్, ప్రబీర్ కలిసి ఈ కేసును విచారిస్తున్నప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుసుకుంటారు. ఈ వరుస హత్యలు ప్రముఖ బెంగాలీ కవుల మరణ వార్షికోత్సవాలతో సంబంధం కలిగి ఉన్నాయని గుర్తిస్తారు. ఈ దర్యాప్తులో రచయిత అయిన నీబరణ్ చక్రవర్తి పై పోలీసులకు అనుమానం కలుగుతుంది. ప్రస్తుతం నీబరణ్ ఒంటరిగా ఉంటున్నాడు. నిరాశతో అతను తన కవితలను కాల్చివేస్తున్నాడని తెలుస్తుంది. ప్రబీర్, అభిజిత్ అతనిని జర్నలిస్టులుగా పరిచయం చేసుకుంటారు. ఈ పోలీసులు నీబరణ్ ఇంటిని గమనిస్తుంటారు. చివరికి హంతకున్ని పోలీసులు పట్టుకుంటారా ? నీబరణ్ ఈ హత్యలు చేస్తుంటాడా ? మరో కోణం ఏమైనా ఉందా ? కిల్లర్ హత్య చేశాక కవితని ఎందుకు వదిలి వెళ్తున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పోలీసులనే తికమక పెట్టే వింత ఊరు … ఊహకందని ట్విస్టులతో క్లైమాక్స్ వరకు గందరగోళమే
మూడు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బైషే స్రాబోన్’ (Baishe Srabon). 2011 లో వచ్చిన ఈ మూవీకి సృజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ కోల్‌కతాలో జరిగే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు ప్రసెంజిత్ చటర్జీ, పరమ్‌బ్రత చటర్జీ, రైమా సేన్, అబీర్ చటర్జీ, గౌతమ్ ఘోష్ నటించారు. అనుపమ్ రాయ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. Amazon Prime Video, Hoichoi, Jio Hotstar లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.