E-Paper
Advertisement

ఒక్కరోజు పెరోల్, రెండు మిస్టరీ హత్యల కేసు… ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ థ్రిల్లర్

ఒక్కరోజు పెరోల్, రెండు మిస్టరీ హత్యల కేసు… ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ థ్రిల్లర్
Advertisement

Malayalam Thriller on OTT: మలయాళం థ్రిల్లర్ సినిమాలంటేనే చివరి వరకు ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. అలాంటి ఒక సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఒరు వడక్కన్ వెలిచం’ (Oru Vadakkan Velicham) ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేస్తోంది. కెనడా నేపథ్యంలో, కేవలం 70 నిమిషాల క్రిస్ప్ రన్‌టైమ్‌తో రూపొందిన ఈ మూవీ, ఒక్కరోజు పెరోల్‌పై బయటకు వచ్చిన ఒక ఖైదీ చుట్టూ తిరిగే రెండు మిస్టరీ హత్యల కథతో ఆకట్టుకుంటోంది. చూడటం మొదలుపెడితే క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోలేరు. అలా ఉంటుంది ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఇంతకీ ఈ ఆ రెండు హత్యల వెనుక ఉన్న అసలు నిజం ఏంటో, ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లైమాక్స్ వరకు ఉత్కంఠ

కెనడాలోని చల్లని వాతావరణంలో ఈ కథ ఉత్కంఠంగా మొదలవుతుంది. డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అల్విన్ సన్నీ (ఆనందకృష్ణన్ తిరువల్లూర్), ఉదయాన్నే పెరోల్ మీద బయటకు వస్తాడు. బయటకు రాగానే తన ఫ్రెండ్ దగ్గర కారు తాళాలు తీసుకుని, తన కోసం ఎదురుచూస్తున్న జెస్సికా (సురభి సురేష్ బాబు) అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ అల్విన్ ఆమెను వదిలేసి మళ్ళీ డ్రగ్స్ కోసం వెళ్తాడు. ఆ తర్వాత జెస్సికా ఉంటున్న ఓ పాడుబడిన ఇంటికి వెళ్ళినప్పుడు, ఆమె తన లైఫ్‌లో జరిగే ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఒక డైరీలో రాసుకుంటుందని అల్విన్ గమనిస్తాడు. అయితే బయటకు వచ్చిన ఆ సంతోషం అల్విన్‌కు ఎంతోసేపు నిలవదు. సాయంత్రం అయ్యేసరికి పోలీసులు అతడిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు.

Advertisement

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ జీఎంకే (హరీష్ మీనన్), అల్విన్‌ను పోలీస్ స్టేషన్‌లోని ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి విచారణ మొదలుపెడతాడు. తన పాత పార్ట్‌నర్ హత్యతో పాటు, జెస్సికా కనిపించకుండా పోవడం వెనుక అల్విన్ హస్తం ఉందనే అనుమానంతో ఆఫీసర్ అతడిని ప్రశ్నిస్తాడు. బయట ఎముకలు కొరికే చలి ఉంటే, లోపల వీళ్ళిద్దరి మధ్య జరిగే మాటల యుద్ధం కథలో ఉత్కంఠను పెంచుతుంది. విచారణ సాగుతున్న కొద్దీ పాత విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. జెస్సికా డైరీలోని రహస్యాలతో పాటు థెరిసా, పాల్ గిబ్సన్, మోహ్సిన్ వంటి మిగతా పాత్రలకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటో మెల్లగా తెలుస్తుంది.

అల్విన్ చెబుతున్న మాటల్లో నిజమెంత, అబద్ధమెంత అనేది ఆఫీసర్ జీఎంకే తన తెలివితో బయటకు లాగుతాడు. డ్రగ్స్ దందా, నమ్మకద్రోహాలు, పాత కక్షల మధ్య ఆగిపోయిన రెండు మరణాల వెనుక ఉన్న అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు ఆ ఇద్దరినీ హత్య చేసిందెవరు? ఆల్విన్ నిజంగానే నిర్దోషా లేక ఆ హత్యల వెనుక అతని పగ దాగి ఉందా? అనేది ఊపిరి బిగబట్టి చూసేలా తెరకెక్కించారు.

ఎక్కడ చూడచ్చు అంటే ?

Advertisement

హరీష్ మీనన్ (Harish Menon), ఆనందకృష్ణన్ తిరువళ్ళూర్ (Anandakrishnan Thiruvallor), సురభి సురేష్ బాబు (Surabhi Suresh Babu) ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఒరు వడక్కన్ వెలిచం’ (Oru Vadakkan Velicham) సినిమాకు అఖిల్ సురేష్ బాబు (Akhil Sureshbabu) దర్శకత్వం వహించారు. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సింప్లీ సౌత్ (Simply South) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 నవంబర్ 19 నుంచి విదేశాల్లోని (భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా) ప్రేక్షకులకు సింప్లీ సౌత్‌లో అందుబాటులోకి రాగా, భారత్‌లోని ప్రేక్షకులు మనోరమ మ్యాక్స్ (manoramaMAX), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఒరిజినల్ మలయాళం ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సదుపాయం కూడా ఉన్న ఈ షార్ట్ అండ్ క్రిస్ప్ థ్రిల్లర్, వీకెండ్‌లో సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి ఒక మంచి ఆప్షన్.

Read Also: గాల్లో మాయమైన విమానం 35 ఏళ్ల తర్వాత క్రాష్… ఇండియన్ స్క్రీన్‌పై అరుదైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్… ఒక్కసారి మొదలుపెడితే క్లైమాక్స్ వరకు కదలలేరు

Related News

టిఫిన్ డెలివరీ బాయ్ నుండి వైరల్ యూట్యూబర్ వరకు… చూస్తే ఒక్క ఎపిసోడ్ కూడా వదలరు

This Week OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

చిరు మెగావర్స్ టాక్  షో ముహూర్తం పిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆఫీసులో బాస్‌తో సీక్రెట్ లవ్… ఓటీటీని ఉపేస్తున్న రొమాంటిక్ సిరీస్

గాల్లో మాయమైన విమానం 35 ఏళ్ల తర్వాత క్రాష్… ఇండియన్ స్క్రీన్‌పై అరుదైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్… ఒక్కసారి మొదలుపెడితే క్లైమాక్స్ వరకు కదలలేరు

‘పంచాయత్’ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. సీజన్ 5 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫులేరాలో మళ్లీ నవ్వుల జాతర ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×