E-Paper
Advertisement

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి.. బిజెపి అంటేనే వాటికి భయం: బండి సంజయ్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి.. బిజెపి అంటేనే వాటికి భయం: బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: ఇవాళ బండి సంజయ్ చేసిన ఫేస్-టు-ఫేస్ మాటలు చూస్తుంటే రాజకీయాల్లో వేడి బాగానే పెరిగినట్టు కనిపిస్తోంది. రాష్ట్రం, దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలకు వివరిస్తామని చెప్పిన ఆయన, కాంగ్రెస్‌పైనా బీఆర్ఎస్‌పైనా గట్టిగానే విరుచుకుపడ్డారు. అదే విధంగా నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన పై క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

Advertisement

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు రావడమే ఎక్కువేనని సంజయ్ అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇక ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని జనం ఓటేస్తారని ప్రశ్నించారు. దేశంలో మొదట ఓట్ చోరీకి పాల్పడింది కాంగ్రెస్ పార్టీనేనని.. సమాజంలో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ముందు తమ పార్టీ గురించి ఆలోచించుకుంటే బాగుంటుందని హితవు పలికారు.

బీఆర్ఎస్‌తో పొత్తు.. నితిన్ నబీన్ పర్యటన

Advertisement

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని తాము మొదటినుంచీ చెబుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండూ కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. బిజెపి అంటేనే ఆ రెండు పార్టీలకు వణుకు పుడుతోందన్నారు. వాళ్ల స్టేట్మెంట్లే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను పట్టించుకునే పరిస్థితే లేదని, గత ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ను మట్టికరిపించింది బిజెపి మాత్రమేనన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే నితిన్ నబీన్ కరీంనగర్ వస్తున్నారని చెప్పారు.

బూత్ స్థాయి నుంచే బిజెపి బలం

దేశం కోసం బూత్ స్థాయి నుంచి కష్టపడే పార్టీ బిజెపి ఒక్కటేనని సంజయ్ స్పష్టం చేశారు. పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగినందునే ఏ కార్యక్రమం పెట్టినా జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. మొత్తం మీద ఈ మాటలతో సంజయ్ ప్రత్యర్థులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Also Read: తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు పర్యటనకు వస్తున్నారు?- కోమటి రెడ్డి

Tags

Related News

తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు పర్యటనకు వస్తున్నారు?- కోమటి రెడ్డి

మాట నిలబెట్టుకున్న రేవంత్.. 214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల రివార్డులు!

3 ఏళ్లలో అన్యాయం జ‌రిగింది.. రాజ‌గోపాల్ రెడ్డి ఇష్యూపై ఉత్త‌మ్ రియాక్ష‌న్‌!

అర్ధరాత్రి కాల్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య!

స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం

నేడు కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ ఇదే?

ఇంటర్ బోర్డు రద్దు పై భగ్గుమంటున్న బీఆర్ఎస్.. అసలు కారణం అదేనా..?

Big Stories

Advertisement
×