Late Bloomer Season 3 on OTT: ఈ మధ్య ఓటీటీలలో కామెడీ డ్రామా సిరీస్‌లకు ప్రేక్షకులు మాత్రం క్రేజీగా చూస్తున్నారు. అందులోనూ మన పక్కంటి కుర్రాడిలా అనిపించే కథ, సోషల్ మీడియా వైరల్ కల్చర్, కుటుంబ బాధ్యతల మధ్య నలిగే యువత జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తే ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. అలా తాజాగా ఓటీటీలో నవ్వుల తుఫాను సృష్టిస్తూ, చూసిన ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్న కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘లేట్ బ్లూమర్’ (Late Bloomer) సీజన్ 3. ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ జస్మీత్ రైనా (Jasmeet Raina) తన రియల్ స్టోరీ ఆధారంగా స్వయంగా రచించి, ప్రధాన పాత్రలో నటించిన ఈ కెనెడియన్ కామెడీ డ్రామా సిరీస్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీటర్ హువాంగ్ (Peter Huang) దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో బల్జిందర్ సింగ్ అత్వాల్, సందీప్ బాలి, యాష్లే గాంగర్, సుగెంజా శ్రీ కీలక పాత్రలు పోషించారు. ఒక్కసారి చూడటం మొదలుపెడితే ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా బింజ్ వాచ్ చేసేలా ఉండే ఈ సిరీస్ కథేంటో, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ సిరీస్ కథంతా కెనడాలో నివసించే జస్మీత్ దత్తా (జస్మీత్ రైనా) అనే ఒక పంజాబీ సిక్కు యువకుడి జీవితం చుట్టూ ఎంతో సరదాగా, ఆసక్తికరంగా సాగుతుంది. తన తోటి స్నేహితులంతా జీవితంలో బాగా స్థిరపడిపోతుంటే, జస్మీత్ మాత్రం తన తల్లి నడిపే టిఫిన్ బిజినెస్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవితంలో వెనుకబడిపోయాననే అసంతృప్తితో ఉంటాడు. ఆ తరువాత సరదాగా వీడియోలు చేయడం మొదలుపెట్టి ఇంటర్నెట్‌లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. చివర్లో కుటుంబ గొడవల వల్ల ఇంటి నుండి బయటకు రావాల్సి వస్తుంది.
ఇంటి నుండి బయటకు వచ్చాక ఇండియన్ స్టూడెంట్స్‌తో కలిసి ఒక బేస్‌మెంట్ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ కెరీర్‌లో ఎదుగుతాడు. తనకు ఇష్టమైన అమ్మాయి రెబెక్కాతో ప్రేమలో పడతాడు కానీ అదికూడా ఊహించని మలుపులు తిరిగి విడిపోయేదాకా వస్తుంది. ఇక ప్రేమ విఫలమైన బాధ నుండి కోలుకుని, జస్మీత్ పెద్ద సెలబ్రిటీగా మారతాడు. పంజాబీ సినిమాల్లో నటించడం, పెద్ద ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరించడం వంటివి చేస్తాడు. తన కొత్త స్టార్‌డమ్‌ను జస్మీత్ ఎలా నిలబెట్టుకున్నాడనేది కడుపుబ్బా నవ్విస్తూనే హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించారు.
భారతదేశంలో ‘లేట్ బ్లూమర్’ (Late Bloomer) సిరీస్‌లోని మొత్తం మూడు సీజన్లు (24 ఎపిసోడ్‌లు) ప్రస్తుతం లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కెనడాలోని Crave ప్లాట్‌ఫామ్‌లో మొదటి సీజన్ 2024 జనవరి 19న, రెండవ సీజన్ ఏప్రిల్ 11, 2025న, మూడవ సీజన్ 2026 ఏప్రిల్ 24న విడుదలయ్యాయి. ఆ తర్వాత ఇండియాలోని లయన్స్‌గేట్ ప్లేలో సీజన్ 1 2026 మార్చి 27న విడుదల కాగా, సీజన్ 2 సీజన్ 3, 2026 నవంబర్ 20 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మీకు నేరుగా లయన్స్‌గేట్ ప్లే సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా, Amazon Prime Video, Apple TV యాప్‌లలో ఉండే Lionsgate Play యాడ్ ఆన్ ఛానెళ్ల ద్వారా 7 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత నెలకు సుమారు ₹99 నుండి వీటిని చూడవచ్చు. అయితే ఈ సిరీస్ ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా రాలేదు.