OTT Movie : టీనేజ్ లవ్ స్టోరీలు రకరకాలుగా ఉంటాయి. ప్రేమ అనే పదానికి ఇప్పుడు అర్థాలు మారిపోయాయి. పొద్దున్నే ప్రేమించు సాయంత్రం గుడ్ బై చెప్పే రోజులు వచ్చేశాయి. ఫారిన్ కల్చర్ లో ఇది సాధారణమే. మన వాళ్లు కూడా ఈ కల్చర్ కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోయిన్, బాయ్ ఫ్రెండ్ ఉండగానే మరొకరిని లవ్ చేస్తుంది. ఈ టీనేజ్ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
2019 లో వచ్చిన ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ఆఫ్టర్’ (After). అన్నా టాడ్ రాసిన నవల ఆధారంగా, జెన్నీ గేజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో ఫియెన్నెస్ టిఫిన్, జోసెఫిన్ లాంగ్‌ఫోర్డ్ నటించారు. రహస్యంగా ఒక అబ్బాయిని ప్రేమించే అమ్మాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఏప్రిల్ 12న అవిరాన్ పిక్చర్స్ ద్వారా ఈ మూవీ విడుదలైంది. విమర్శకుల నుండి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. $14 మిలియన్ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $69 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ‘ఆఫ్టర్ వుయ్ కొల్లిడెడ్’ సీక్వెల్ 2020లో విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
టెస్సా చదువుకోవడానికి కాలేజీకి వస్తుంది. ఈమెకు ఇదివరకే నోవా అనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. టెస్సా క్లాస్మేట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటారు. టెస్సా అవి ఏమి పట్టించుకోకుండా మొదట్లో చదువు మీద ఇంట్రెస్ట్ పెడుతుంది. అయితే ఒక రోజు ఈమెను ఫ్రెండ్స్ ఒక పార్టీకి తీసుకెళ్తారు. అక్కడ హార్డిన్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అప్పట్నుంచి ఆమెలో మార్పు మొదలౌతుంది. అతనితో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా హార్డిన్ ను లవ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ హద్దులు దాటాలని చూస్తూ ఉంటారు. అలాగే ఒక రోజు హద్దులు దాటి ఆ పని కూడా పూర్తి చేసుకుంటారు. ఇంతలో టెస్సా కి ఒక విషయం తెలుస్తుంది. హార్డిన్ టెస్సా తో గడుపుతానని మరొక అమ్మాయితో పందెం కడతాడు. ఈ విషయం తెలుసుకుని అతనితో గొడవ పడుతుంది టెస్సా. నిజానికి మొదట పందెం కట్టినా, ఆ తర్వాత ఆమెను లవ్ చేస్తాడు హార్డిన్. ఈ విషయం నోవాకి కూడా తెలిసిపోతుంది. అటు నోవా దూరమవడం. ఇటు హార్డిన్ తో గొడవ పడడంతో టెస్సా బాగా బాధపడుతుంది. చివరికి టెస్సా ఎవరిని లవ్ చేస్తుంది? ఈమె ప్రేమ ఎటువైపు వెళుతుందో తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆఫ్టర్’ (After)అనే ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.