BigTV English

Mahesh Babu : వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ‘అతడు ‘ మూవీ.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

Mahesh Babu : వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ‘అతడు ‘ మూవీ.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. అలా ఒక్కో సినిమాతో ఆయన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇవాళ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ హీరో నటించిన ప్రతి మూవీ ఒక అద్భుత కావ్యం అనే చెప్పాలి. అయితే మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అందులో అతడు మూవీ సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది.. ఏ హీరో సినిమాకు దక్కని గౌరవం ఈ మూవీకి దక్కింది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


స్టార్ హీరో మహేష్ బాబు నటించిన బెస్ట్ మూవీలలో అతడు మూవీ కూడా ఒకటి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005 లో విడుదల అయిన ఒక తెలుగు సినిమా. ఇందులో హీరోగా మహేష్ బాబు నటించాడు. త్రిష కథానాయికగా నటించింది. డి. కిషోర్, ఎం. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.. ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటిలో సెన్సేషనల్ రికార్డు ను క్రియేట్ చేసింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

మూడు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఇది తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరు తో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు.. ప్రతి భాషలోనూ మంచి రికార్డులను బ్రేక్ చేసింది. 2005 లో ఈ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ మాట రచయిత, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది.. అప్పటిలో వరుస రికార్డులు సొంతం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో రికార్డు ను సొంతం చేసుకుంది. టీవిలో ఏ మూవీ టెలికాస్ట్ అవ్వలేదు కానీ ఈ మూవీ మాత్రం 1500 సార్లు టీవీ లో వచ్చింది. ప్రముఖ ఛానెల్ స్టార్ మాలో ఈ మూవీ ఇప్పటివరకు ఎక్కువ సార్లు ప్రసారం చేశారని ఓ అభిమాని పోస్ట్ చేశాడు. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టలేదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.


మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. మహేష్ వరుస సినిమాలను చేస్తున్నాడు.. ఇటీవల కాలంలో ఈయన నటించిన ప్రతి మూవీ భారీ విజయాన్ని అందుకున్నాయి. గత ఏడాది గుంటూరు కారం సినిమా లో నటించారు. అది మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. భారీగానే కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×