E-Paper
Advertisement

ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు ​

ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు   ​
Advertisement

True Crime Documentary Series: నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు వింటేనే గుండె తరుక్కుపోతుంది. అలాంటి ఒక రియల్ లైఫ్ ట్రాజెడీ ఆధారంగా రూపొందిన హార్ట్-రెంచింగ్ డాక్యుమెంటరీ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కళ్లముందే తిరిగిన కూతురు సడన్‌గా మాయమైపోతే ఆ తల్లి గుండె అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. గ్రాడ్యుయేషన్ ట్రిప్ కోసం అరుబా ఐలాండ్‌కి వెళ్లిన 18 ఏళ్ల నటాలీ హాలోవే అనే అమ్మాయి కథ ఇది. 2005 లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన హార్ట్ టచింగ్ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ పేరే ‘టేకెన్: నటాలీ హాలోవే’ (Taken: Natalee Holloway). ఇది కేవలం ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, ఒక తల్లి ప్రేమకు నిదర్శనం. ప్రతీ ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించే ఈ ఎమోషనల్ అండ్ మిస్టరీ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. దీని కథ ఏంటి ? తెలుగులో ఉందా ? అనే వివరాల్లోకి వెళ్తే..

కథలోకి వెళ్తే.. 

ఈ సిరీస్ కథ 2005 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నడుస్తుంది. నటాలీ హోలోవే అనే 18 ఏళ్ల అమెరికన్ హైస్కూల్ గ్రాడ్యుయేట్ అమ్మాయి, తన ఫ్రెండ్స్ తో కలిసి అరుబా అనే ఐలాండ్ కి గ్రాడ్యుయేషన్ ట్రిప్ కోసం వెళ్తుంది. ఎంతో హ్యాపీగా సాగుతున్న ఆ ట్రిప్ లో ఒక రాత్రి ఒక నైట్ క్లబ్ బయట ముగ్గురు స్థానిక యువకులతో కలిసి కార్ లో వెళ్లిన నటాలీ, ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. ఆమె గాల్లో కలిసిపోయినట్టు మాయమైపోతుంది. పోలీసులు ఎంత వెతికినా కనీసం ఆమె క్లూ కూడా దొరకదు.

Advertisement

అక్కడి నుండి నటాలీ తల్లి బెత్ హోలోవే చేసిన ఒంటరి పోరాటం రీడర్స్ ని కన్నీళ్లు పెట్టిస్తుంది. విదేశీ చట్టాలు సహకరించకపోయినా, స్థానిక అధికారులు కేసును పక్కదారి పట్టించినా, దాదాపు 20 సంవత్సరాల పాటు ఆ తల్లి తన కూతురికి ఏమైందో తెలుసుకోవడానికి అలుపెరగని పోరాటం చేస్తుంది. ఆ ప్రాసెస్ లో ఆమె ఎదుర్కొన్న మానసిక నరకం, మీడియా ప్రెజర్, ప్రధాన నిందితుడు జోరన్ వాండర్ స్లూట్ ఆ తల్లి ఎమోషన్స్ తో ఆడుకున్న మైండ్ గేమ్స్ ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు. బెత్ హాలోవే నిజ జీవిత ఇంటర్వ్యూలు, గతంలో ఎన్నడూ చూడని ఇన్వెస్టిగేషన్ ఫుటేజీలు ఈ డాక్యుమెంటరీలో ఉంచారు. ప్రతి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు గుండె బరువెక్కుతుంది, కన్నీళ్లు ఆగవు. ట్రూ-క్రైమ్ జానర్ ఇష్టపడే వారే కాకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఎమోషనల్ మాస్టర్‌పీస్ ఇది.

తెలుగులో ఉందా ?

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ ట్రూ-క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ ‘టేకెన్: నటాలీ హాలోవే’ (Taken: Natalee Holloway) ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ దీనిని ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రాపర్ ఆడియో డబ్బింగ్ తో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. 2026 నవంబర్ 4 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Read Also: అడవిలో మనుషుల్ని పీక్కుతినే రాక్షస జీవి… ఒళ్లు గగుర్పొడిచే హిస్టారికల్ హర్రర్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులో

Tags

Related News

కవల సోదరుల మధ్య చిచ్చు… కొడుకు మరణంతో తుపాకీ పట్టిన తల్లి… చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌… జాతి వివక్షను ఎదిరించి ప్రపంచాన్నే షేక్ చేసిన బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ రియల్ స్టోరీ

ట్విస్ట్ అంటే ఇదీ… మర్డర్ కేసు కోసం మగాడిగా మారే లేడీ డిటెక్టివ్… మతిపోగొట్టే మలుపులున్న కామెడీ సిరీస్

బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడుపుదామని వెళ్తే గుండె జారిపోయే ట్విస్ట్… దీన్ని చూశాక ప్రియుడిని పొరపాటున కూడా నమ్మరు

అడవిలో మనుషుల్ని పీక్కుతినే రాక్షస జీవి… ఒళ్లు గగుర్పొడిచే హిస్టారికల్ హర్రర్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులో

అయ్యబాబోయ్ అద్దంలో అరాచకం… చలికాలంలోనూ చెమటలు పట్టించే హారర్ మూవీ… స్ట్రీమింగ్ తెలుగులో

చనిపోయిన కుక్కకు స్వర్గం నుంచి తిరిగొచ్చే ఛాన్స్‌… పగ తీర్చుకోవడానికి తిరిగొచ్చి ఏం చేసిందో తెలుసా ?

Big Stories

Advertisement
×